తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం ఉదయం విడుదలైంది. సచివాలయంలో అధికారికంగా నోటిఫికేషన్‌ ను జారీ చేశారు అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్ గెజిట్‌ను జారీ చేశారు.  కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం నోటిఫికేషన్‌ జారీ అయిన మరుక్షణం నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. అభ్యర్ధుల నామినేషన్ల స్వీకరణకు 19 వరకు గడువు ఉంది. 20న పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు ఉంది. డిసెంబర్‌ 7న పోలింగ్‌, 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. 13వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.   

Image result for telangana election notification release

ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్‌ దాఖలు సమయం.

ఈనెల 19 వరకు నామినేషన్‌ దాఖలుకు గడువు

ఈనెల 20న స్క్రూటినీ, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు

డిసెంబర్‌ 7న పోలింగ్‌, డిసెంబర్‌ 11న కౌంటింగ్‌ 


ఎన్నికల సమయం                                         షెడ్యూల్గె

జిట్ నోటిఫికేషన్ విడుదల తేది                  12.11.2018 (సోమవారం)
నామినేషన్ దాఖలుకు చివరి తేది                 19.11.2018 (సోమవారం)
స్క్రూటినీ నామినేషన్లు                                   20.11.2018(మంగళవారం)
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేది        22.11.2018(గురువారం)
పోలింగ్‌ తేదీ                                                    07.12.2018(శుక్రవారం)
లెక్కింపు తేదీ                                                 11.12.2018(మంగళవారం)
ఎన్నికల ప్రక్రియ ముగింపు                           13.12.2018(గురువారం)



  

మరింత సమాచారం తెలుసుకోండి: