టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం.. కాంగ్రెస్ అడ్ర‌స్‌ను గ‌ల్లంత‌య్యేలా చేస్తోంది. ఇప్ప‌టికే విభ‌జ‌నతో ఏపీలో తీవ్రంగా న‌ష్ట‌పోయిన కాంగ్రెస్‌.. ఇక్క‌డ బ‌ల‌ప‌డేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏ ఒక్క‌టీ ఫ‌లించ‌లేదు. పాత వారికి పెద్ద‌పీట‌! అంటూ నాయ‌కులు వీధి వీధి తిరిగినా.. పార్టీ నుంచి వెళ్లిపోయి.. వేరే పార్టీల్లో చేరిన వారు ఒక్క‌రూ కాంగ్రెస్ గూటికి తిరిగి చేరిన దాఖలా క‌నిపించ‌లేదు. నిజానికి కాంగ్రెస్ ఇంచార్జ్‌గా రంగంలోకి దిగిన ఊమెన్ చాందీ.. ఏపీలో కాంగ్రెస్‌కు కొత్త ర‌క్తం ఎక్కించి.. వెంటిలేట‌ర్‌పై ఉన్న పార్టీని బ‌తికించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఈక్ర‌మంలోనే ఆయ‌న పాత‌వారిని కొత్త స్వ‌రంతో ఆహ్వానించారు. వ‌స్తే.. మీకు మంచి ప‌ద‌వులు ఇస్తామ‌ని చెప్పుకొచ్చారు. 

Image result for రాహూల్ గాంధీ

అయితే, ఏ ఒక్కరూ ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ గూటికి చేరింది లేదు. ఈ షాక్ నుంచి కాంగ్రెస్ నేతలు తేరుకోక ముందే.. ఇప్ప డు ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వేసిన పాచిక‌తో గుండు గుత్తుగా మొత్తం ఏపీలో కాంగ్రెస్ అడ్ర‌స్ లేని ప‌రిస్థితి కి చేరుకుంది. కేంద్రంలో చ‌క్రం తిప్పుతానంటూ.. చంద్ర‌బాబు ఊరూరా తిరుగుతున్నారు. అంతేకాదు, కేంద్రంలోని న‌రేం ద్ర మోడీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపే వ‌రకు కూడా తాను చ‌లించేది లేద‌ని, అప్ప‌టి వ‌ర‌కు తాను అన్ని శ‌క్తుల‌ను కూడ‌గ‌డ తాన‌ని వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే బ‌ద్ధ శ‌త్రువైన కాంగ్రెస్‌తోనూ జ‌ట్టుక‌ట్టారు. ఢిల్లీ వెళ్లి.. కాంగ్రెస్ అధినేత రాహుల్‌తో భేటీ అయ్యారు. ఇక‌, రాహుల్ కూడా బాబుతో పార్టీకి ఉన్న శ‌త్రుత్వాన్ని మ‌రిచిపోయి ముందుకు సాగుతాన‌ని ప్ర‌క‌టించారు. 

Image result for modi

అదేస‌మయంలో ఏపీలోనూ కాంగ్రెస్ బాగుప‌డుతుంద‌ని, చంద్ర‌బాబు పార్టీకి ఊతం ఇస్తార‌ని రాహుల్ స‌హా పార్టీ నేత‌లు భావించారు. బాబు ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు రాహుల్ తో చేతులు క‌ల‌ప‌లేద‌న్న విష‌యం తెలిసిందే. ఇదిలావుంటే, రాహుల్‌కు ఉన్న విశాల హృద‌యం బ‌హుశ ఏపీలోని కాంగ్రెస్ నేత‌ల‌కు లేన‌ట్టుగా ఉంది. ప్ర‌ధానంగా సోని యాను త‌రిమి కొట్టే వ‌ర‌కు విశ్ర‌మించ‌ను. కాంగ్రెస్‌ను భూస్తాపితం చేసే వ‌ర‌కు నా పోరు ఆగ‌ద‌ని 2014 ఎన్నిక‌ల స‌మయం లో చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపు ఇక్క‌డి నాయ‌కుల‌కు ఇంకా వినిపిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే ఇక‌, టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌లో ఉండి.. బాబును మోయ‌లేమంటూ.. ఇప్ప‌టికే ముగ్గురు కీల‌క నాయ‌కులు పార్టీకి రాం రాం చెప్పారు. 


వట్టి వసంతకుమార్‌, సి.రామచంద్రయ్య, బాలరాజులు త‌మ దారి తాము చూసుకున్నారు. ఇక‌, ఇప్పుడు వైఎస్‌కు అత్యంత అనుచ‌రుడిగా పేరు తెచ్చుకున్న కేవీపీ రామ‌చంద్ర‌రావు కూడా కాంగ్రెస్‌కు బై చెప్ప‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు చిరంజీవి కూడా కాంగ్రెస్‌ను వీడ‌నున్నారు. ఆయ‌న పార్టీ స‌భ్య‌త్వం ముగిసినా.. కూడా ఇప్ప‌టికీ రెన్యువ‌ల్ చేయించుకోలేదు. ఇలా ప‌లువురు నాయ‌కులు కాంగ్రెస్ను వీడేందుకు రెడీ అవుతున్నారు. దీనిని బ‌ట్టి బాబు దెబ్బ‌కు కాంగ్రెస్ బ‌లోపేతం కాదు.. భ్ర‌ష్టు ప‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: