తెలుగుదేశం అధినేతను ఎప్పుడూ ఆకాశంలోనే ఉంచుతూ ఆయనకు లేనికీర్తిని ఆపాదిస్తూ ఏత్తేస్తూ ఉంటుంది ఉభయ తెలుగురాష్ట్రాల నిండా వ్యాపించిన పచ్చ మీడియా పత్రిలు, చానళ్ళు, యూట్యూబు చానళ్ళు సోషల్ మీడియా షార్ట్ స్టోరీస్ అవసరమైతే నేతనేసినట్లు అల్లిన జ్యోతిష్యం. ఆయన వ్యూహాత్మక ఎత్తుగడల్లో ఆరితేరిన చెయ్యి అని ఆయన భారత ప్రదాని నరేంద్ర మోడీని భవిష్యత్ లో నిశీధిలో కలిపెయ్యనున్నారని, కలవకుంట్ల చంద్రశేఖరరావును శంకరగిరి మాన్యాలు పట్టించనున్నారని విపరీత ప్రచారం చేస్తూ ఉంటారు.  వీటన్నిటికి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. 
congress TDP allience is going to be a utter flop కోసం చిత్ర ఫలితం
నారా చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తుకు కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ తిననుందా? దశాబ్దాలుగా ఆ పార్టీకి అండగా ఉంటున్న వారిని ఒక్క ప్రకటనతో చంద్రబాబు  దూరం చేసేశారా? ఎన్నికల పొత్తు వెనుక చంద్రబాబు కు మేలు చేసే ఎత్తుగడలే తప్ప, కాంగ్రెస్ కు ఏమాత్రం ఉపయోగపడని పైగా ధారుణమైన కీడు చేసే అంశాలేనని  విశ్లేషకుల అభిప్రాయంగా వ్యక్తమౌతుంది. అంతే కాదు ఈ పొత్తు వెనుక కాంగ్రెస్ కు ఒక బలమైన సామాజిక వర్గాన్ని దూరం చెసే శకుని తరహా ఎత్తుగడ అంతర్ముఖంగా కనిపిస్తుందని  సమాధానం వస్తోంది. 
congress TDP allience is going to be a utter flop కోసం చిత్ర ఫలితం
ఒక వైపు చంద్రబాబుతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని దూకుడుగా ముందుకు సాగుతున్న సమయంలో కాంగ్రెస్ షాకయ్యే రీతిలో విశ్లేషకుల నుండే కాదు కాంగ్రెస్ పెద్దల నుండి అప్-డేట్ రావడం చిత్రంగా ఉన్నప్పటికీ - వాస్తవ పరిస్థితులు ఇందుకు సాక్ష్యంగా ఋజువులుగా కనిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల విశ్లెషణల ప్రకారం ఇదంతా గులాబీ పార్టీకి, అధిపతి కేసీఆర్ కు పరోక్షంగా ఎంతో మేలు చేసే రీతికి మారిపోవటం గమనార్హం.
congress TDP allience is going to be a utter flop కోసం చిత్ర ఫలితం
రాజకీయ వర్గాల అభిప్రాయం ప్రకారం, మహాకూటమికి ఏర్పడటానికి ముందు కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజికవర్గం అండగా ఉండి, ఈ సారి టి ఆర్ ఎస్ కు ఝలక్ ఇచ్చే  పరిస్థితి నెలకొన్న సందర్భంలో నారా చంద్రబాబు నాయుడి వ్యూహం కాంగ్రెస్ తొ టిడిపి పోత్తు కాంగ్రెస్ పై ధారుణమైన దెబ్బ కొట్టింది.  అంతే కాదు కాంగ్రెస్ శాసనసభ పోటీదారుల జాబితా చంద్రబాబు చేత విడుదలౌతుందనటంతో మొత్తం రెడ్డి వర్గం ఒక్కసారిగా షాక్ కు గురైంది. అదే కాంగ్రెస్ సీనియర్ అలుగుటయే ఎరుంగని జానారెడ్డి ఆగ్రహోదగ్దుడవటం కాంగ్రెస్ కు చావుదెబ్బగానే భావించాలి.
congress TDP allience is going to be a utter flop కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ విషయానికి వస్తే దాదాపు 50 శాతం పైగా ఈ రెడ్డి సామాజిక వర్గ మద్దతు కాంగ్రెస్ కు ఉండేది. వీరు సహజంగానే టీడీపీకి వ్యతిరేకంగా రాజకీయంగా వ్యవహరించారు. అలాంటి నేపథ్యంలో తాజాగా పొత్తు పేరుతో చంద్రబాబు కాంగ్రెస్ కు దగ్గరవడం ఈ ఎత్తుగడల వల్ల పలువురు రెడ్డి నేతలకు సీట్లు దక్కకపోవడాన్ని ఆ వర్గం జీర్ణించుకోవడం లేదని తెలుస్తోంది.  తమకు బద్దశత్రువు అయిన టిడిపి చంద్రబాబు నాయుడు తన రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ కు చేరువ అవడం - పైగా అది తమకు నష్టం చేసేలా ఉండటంతో వారు కాంగ్రెస్ కు దూరమవుతూ టీఆర్ఎస్ పార్టీకి దగ్గరవుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
congress TDP allience is going to be a utter flop కోసం చిత్ర ఫలితం
కేసీఆర్,  రెడ్డి నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం - కార్పొరేషన్ పదవులు వంటి హామీలను ఇవ్వడంతో పాటుగా ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఇటీవల జరిగిన కత్తి దాడి అంశంలో వ్యవహరించిన తీరుతో, తమకు కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని సదరు రెడ్డి సామాజిక వర్గం భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. మరో వైపు రెడ్ల సారథ్యంలోని పలు మీడియా సంస్థలు సైతం మహకూటమిని కాంగ్రెస్ కంటే టిడిపి చంద్రబాబే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారని విశ్లేషిస్తూ, ఈ నేపథ్యం లో టిఆర్ఎస్ మాత్రమే ఉత్తమ ప్రత్యామ్నాయమని పేర్కొంటున్నాయి.
సంబంధిత చిత్రం
ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తాము కాంగ్రెస్ కు అండగా నిలవడంకంటే, టీఆర్ఎస్ కు మద్దతిస్తేనేమేలని రెడ్లు భావిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే తెలుగురాష్ట్రాల్లో రెడ్డి సామాజికవర్గానికి చేటు జరుగుతుందని ఈసారికి కాంగ్రెస్ దెబ్బ రుచిచూపించడమే మంచిదని ప్రచారం జరుగుతోంది.  
సంక్షిప్తంగా, బాబును దగ్గర చేసుకోవడం అనే ఐడియా ఏదైతే ఉందో అది బాబుకు మేలు చేసేదేకానీ - కాంగ్రెస్ కు ఏమాత్రం ఉపయోగపడని అంశమని పలువురి విశ్లేషణ.  చంద్రబాబుతో రాహుల్ గాంధి పొత్తు పెట్టుకోవటం మరోసారి రాహుల్ గాంధిని నేషనల్ పప్పు అని ఋజువుచేయబోతోంది.
 congress alliance with TDP కోసం చిత్ర ఫలితం 

మరింత సమాచారం తెలుసుకోండి: