తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, చింతమనేని తదితర నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న సోమవారం కాస్త గట్టిగానే హెచ్చరిక చేశారు. వారంతా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన కూడా మండిపడ్డారు. జనసేన కు అండగా ఉండే యువతను ఎమ్మెల్యే బాలకృష్ణ సంకరజాతి నా కొడుకులు అని సంబోధించారు అని అన్నారు. దెందులూరు రౌడీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను కొడతాడని మంత్రి అచ్చెన్నాయుడు మత్స్యకారులను భూతులు తిడతారని, ఇదేనా మీ సంస్కారం, రాష్ట్రం మీ సొత్తా అని కూడా ప్రశ్నించారు. 
balakrishna unparliamentary language కోసం చిత్ర ఫలితం
టీడీపీ నేతలు కొంత తన మాటలను అదుపులో పెట్టుకోవాలని పవన్ అన్నారు. బాలకృష్ణ కూడా యువతను ఇష్టారీతిన తిడుతున్నారని హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడుకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. 


ఒకటి ఉన్న కులం, రెండు లేని కులమని, మరో కులం లేదని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను ఎందుకు నమ్మాలని అంటుంటారని, ఒకసారి తనకు కూడా అవకాశాన్ని ఇచ్చి  చూడాలన్నారు. చంద్రబాబు ఇప్పుడు హత్యచేయబడ్డ గిరిజన ఎమెల్యే కుమారునికి మంత్రి పదవి ఇచ్చినంతమాత్రాన తనకు గిరిజను తోడుంటారని అనుకుంటే అంతకు మించిన పొరపాటు ఉండదన్నారు. 
సంబంధిత చిత్రం
భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఏపి జన హృదయాల్లో చోటు లేదు అలాగే రాహుల్ గాంధికి కూడా! బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మన జనం గుండెల్లో చోటు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి, ప్రధాని నరేంద్ర మోడీకి వినబడేలా వారికి ఇక్కడ స్థానం లేదని యెలుగెత్తి చెప్పాలన్నారు. మేము పాతిక కేజీల బియ్యం సంపాదించుకోగలమని  మాకు పాతిక ఏళ్ల విజయవంతమైన ప్రయోజనాత్మక జీవితం ఇవ్వాలని యువత కోరుకుంటోందన్నారు. 
atchannaidu కోసం చిత్ర ఫలితం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో చేసిన తప్పునే అమరావతిలో చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. యువత అంటే కొందరు రాజకీయ నాయకుల సంతానం మాత్రమే కాదని ఇంకెందరో సమర్ధవంతమైన యువత ఈ సమాజంలో ఉన్నారన్నారు. కులాలు అంటూ వేరే లేవని, ఒకటి దోపిడీ చేసే కులం మరొకటి దోపిడీకి గురయ్యే కులమని చెప్పారు. ఆధికారంలోకి వస్తే ఏపీలో దోపిడీ చేసే కులాన్ని తాను పూర్తిగా కూలదోస్తానని చెప్పారు. దోపిడీ చేసే టీడీపీ నేతలు అదుపు లో ఉండాలన్నారు. 
chintamaneni butu basha కోసం చిత్ర ఫలితం
2019లో కాకినాడ ఎంపీ సీటు, 7 అసెంబ్లీ స్థానాలు మనమే గెలవాలి 2019లో కాకినాడ పార్లమెంట్ స్థానంతో పాటు, 7 అసెంబ్లీ స్థానాల్లో జనసేనను గెలిపించి మార్పు యొక్క ఆవశ్యకతను బలంగా దద్దరిల్లేలా నిరూపిద్దామని పవన్ కళ్యాణ్ అన్నారు.  జనసేన పార్టీలోకి వచ్చే నాయకులకు ఒకటే చెప్పానని, 2019 ఎన్నికల్లో సీట్ల కోసం కాకుండా 25 సంవత్సరాల సుదీర్ఘ సామాజిక మార్పు తీసుకొచ్చేందుకు పని చేయాలని సూచించానని అన్నారు. అనంతపురం నుంచి మధుసూదన రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. 
chintamaneni butu basha కోసం చిత్ర ఫలితం
సీఎం నినాదాలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నాయకులు లేని జనసేన ఉంటుందేమో కానీ, సైనికులు, జనసేన జెండా లేని గ్రామం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో జన సైనికులు లేని గ్రామం చూపలేరని ఉద్ఘాటించారు.  జనసేన విజయంతో నూతన శకం ఆవిష్కారం కావాలని - దోపీడీలతో నిండిపోయిన వ్యవస్థను కూకటి వేళ్ళతో పీకివేసి ఒక నవసమాజాన్ని, ఒక కొత్త రాజకీయ వ్యవస్థను వచ్చే ఎన్నికల్లో నిర్మిద్దామన్నారు. అభిమానులు అరిచే “సీఎం సీఎం” అనే మంత్రం తనకు భాధ్యతను గుర్తు చేస్తుందని, శ్రీ పాద శ్రీ వల్లభుడు నివసించిన గోదావరి ప్రాంతం, మీరు పఠించే ఈ మంత్రం తప్పకుండా నిజమవుతుం దన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: