తెలంగాణలో గత నెల నుంచి ఎన్నికల హడావుడి మొదలైంది.  తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 105  ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు.  నామినేషన్ దాఖలుకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ మరో రెండు స్థానాల్లో ఎవరిని నిలపాలో తేల్చుకోలేక పెండింగ్ లో ఉంచారు. తొలుత 105, ఆపై 2 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్.  టిఆర్‌ఎస్‌ లో మిగిలిన 12 స్థానాలకు కెసిఆర్‌  అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. 

తాజాగా మరో పది నియోజకవర్గాల్లో పోటీ పడేవారిని గత రాత్రి ప్రకటించారు. ఒక్క ముషీరాబాద్‌ అభ్యర్థి ఎంపిక విషయంలోనే హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఒప్పించి, ముఠాగోపాల్‌కు టిక్కెట్‌ ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం నాయిని నర్సింహారెడ్డిని స్వయంగా కలుసుకొని మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

గత రాత్రి మరో 10 మంది పేర్లు వెల్లడించడంతో, టీఆర్ఎస్ తరఫున పోటీ పడే 117 మంది ఎవరో తేలిపోయింది.ఇంకా అభ్యర్థిని తేల్చని నియోజకవర్గాలు కోదాడ, ముషీరాబాద్. అయితే ఈ సాయంత్రం వరకు ముషీరాబాద్ విషయం తేల్చే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.  


టీఆర్ఎస్ మలిజాబితా వివరాలు : 


మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి
గోషామహల్ - ప్రేమ్ సింగ్ రాథోడ్
చార్మినార్ - మహమ్మద్ సలావుద్దీన్ లోడి
వరంగల్ తూర్పు - నన్నపనేని నరేందర్
హుజూర్ నగర్ - శానంపూడి సైదిరెడ్డి
వికారాబాద్ - డాక్టర్ మెతుకు ఆనంద్
అంబర్ పేట - కాలేరు వెంకటేష్,
మల్కాజిగిరి - మైనంపల్లి హన్మంతరావు
చొప్పదండి - సొంకె రవిశంకర్
ఖైరతాబాద్ - దానం నాగేందర్


మరింత సమాచారం తెలుసుకోండి: