ఇందిరా ప్రియదర్శిని గాంధీ  భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది.   జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.  శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ తన జీవితంలో ఎన్నో విజ‌యాలు అందుకున్నారు. 1972లో భార‌త ర‌త్న పుర‌స్కారాన్ని స్వీక‌రించారు. మెక్సిక‌న్ అకాడ‌మీ అవార్డు ఫ‌ర్ లిబ‌రేష‌న్ ఆఫ్ బంగ్లాదేశ్ (1972), ఎఫ్ఏఓ రెండ‌వ వార్షిక మెడ‌ల్ 1973, న‌గ‌రి ప్ర‌చారిణీ స‌భకు చెందిన సాహిత్య వాచ‌స్ప‌తి (హిందీ) అవార్డు (1976) అందుకున్నారు.
Related image
1953లో అమెరికాకు చెందిన మ‌ద‌ర్స్ అవార్డును స్వీక‌రించారు. దౌత్య‌వేత్త‌గా అందించిన సేవ‌ల‌కు గాను ‘ఇసిబెల్లా డి ఎస్టే అవార్డు ఆఫ్ ఇట‌లీ’ని, ఏల్ యూనివ‌ర్శిటీకి చెందిన హాలెండ్ మెమోరియ‌ల్ ప్రైజ్‌ను అందుకున్నారు. 1967, 1968 సంవ‌త్స‌రాల్లో వ‌రుస‌గా రెండుసార్లు ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ ఒపీనియ‌న్ స‌ర్వేలో అత్యంత అభిమాన మ‌హిళ‌గా అవార్డు అందుకున్నారు. 1971 అమెరికాలోని ప్ర‌త్యేక గ్యాల‌ప్ పోల్ స‌ర్వేలో ప్ర‌పంచ అత్యంత అభిమాన నేత‌గా గౌర‌వం అందుకున్నారు. జంతు సంర‌క్ష‌ణ‌కు చేసిన కృషికిగాను 1971లో అర్జెంటీనా సొసైటీ ఆమెకు గౌర‌వ డిప్లొమా ప్ర‌దానం చేసింది.  1971లో భారత ప్రభుత్వపు అత్యున్నత అవార్డు భారత రత్నను స్వీకరించి ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళగా స్థానం సంపాదించింది. 1983-84 లో రష్యా దేశపు లెనిన్ శాంతి బహుమతి లభించింది. ఇందిరాగాంధీ ప్ర‌ముఖ ర‌చ‌న‌ల్లో ‘ఇయ‌ర్స్ ఆఫ్ ఛాలెంజ్’ (1966 – 69) , ‘ఇయ‌ర్స్ ఆఫ్ ఎన్డీవ‌ర్’ (1969 – 72), ‘ఇండియా’ (లండ‌న్‌) (1975), ఇండే లాస‌న్నే(1979) మొద‌లైన‌వి ఉన్నాయి.
Image result for indira gandhi
ఇంకా అసంఖ్యాక‌మైన సంక‌ల‌నాలు, ప్ర‌సంగాలు, ర‌చ‌న‌లు వెలువ‌రించారు. భార‌త‌దేశంతోపాటు ప్ర‌పంచంలోని అనేక ప్రాంతాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించారు.  పొరుగు దేశాలైన ఆఫ్ఘ‌నిస్థాన్, బంగ్లాదేశ్‌, భూటాన్‌, బ‌ర్మా, చైనా, నేపాల్‌, శ్రీ‌లంక దేశాల‌ను సంద‌ర్శించారు. ఫ్రాన్స్‌, జ‌ర్మ‌న్ డెమోక్ర‌టిక్ రిప‌బ్లిక్‌, ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఆఫ్ జ‌ర్మ‌నీ, గుయాన్‌, హంగేరీ, ఇరాన్‌, ఇరాక్‌, ఇట‌లీ వంటి దేశాల్లో అధికార ప‌ర్య‌ట‌న‌లు జ‌రిపారు.  ఆమె తన జీవితంలో ఎన్నో దేశాలు పర్యటించారు.  సామరస్యపూర్వకమైన చర్చలు జరిపారు. భారత దేశాభివృద్ది కోసం ముఖ్య నేతలను కలిశారు. 
Image result for indira gandhi
అల్జీరియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్‌, బ‌ల్గేరియా, కెన‌డా, చిలీ, చెకొస్ల‌వాకియా, బొలివియా, ఈజిప్ట్ దేశాల‌ను కూడా సంద‌ర్శించారు. ఇండోనేషియా, జ‌పాన్‌, జ‌మైకా, కెన్యా, మ‌లేషియా, మారిష‌స్‌, మెక్సికో, నెద‌ర్లాండ్స్‌, న్యూజిలాండ్, నైజీరియా, ఒమ‌న్‌, పోలెండ్, రుమేనియా, సింగ‌పూర్, స్విట్జ‌ర్లాండ్‌, సిరియా, స్వీడ‌న్‌, టాంజేనియా, థాయ్‌లాండ్ ట్రినిడాడ్‌-టొబాగో, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌, బ్రిట‌న్‌, అమెరికా, ర‌ష్యా, ఉరుగ్వే, వెనెజులా, యుగొస్లావియా, జాంబియా, జింబాబ్వే మొద‌లైన అనేక యురోపియ‌న్‌, అమెరిక‌న్, ఆసియ‌న్ దేశాల్లో కూడా ఇందిరాగాంధీ ప‌ర్య‌టించారు. ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్యాల‌యాన్ని కూడా సంద‌ర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: