చంద్రబాబు జీవితమే ఒక రాజకీయ వేదిక. ఆ వేదికపై అనేక పాత్రలు వచ్చిపోతుంటాయి. ఇప్పుడు మరోపాత్రను తీసుకొచ్చారు అదీ నందమూరి కుటుంబం నుండి. అసలు ఆ కుటుంబాన్నే రాజకీయాలకు దూరం పెడుతూ వచ్చిన చంద్రబాబు ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ అవసరం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇప్పుడు సందు దొరికింది అందులో బాబు దూరిపోయారు. అయితే ఇందులో జూనియర్ ఎన్ టీఅర్ బాబు అనుకుంటున్నట్లు తాజాగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశమేలేదట.   


నందమూరి తనయుడు, చైతన్య రథసారధి, సినీనటుడు, దివంగత టీడీపీ విధాన నిర్ణాయక సభ్యుడు (పోలిట్ బ్యూరో)నందమూరి హరికృష్ణ ముద్దుల కూతురు సుహాసిని బందుత్వంలో ఇటీవల పెద్దమార్పులు చేసుకున్నాయట. ఈ మద్య తన సోదరులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ల కంటే తనమామయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రచారం. 
Image result for kukatpally constituency Vs Nandamuri suhasini
అందుకు నేపధ్యం సుహాసినికి ఆమె సోదరుడు జానికి రామ్ అంటే చాలా ఇష్టం. కళ్యాణ్ రామ్,  జూ.ఎన్టీఆర్ లు సినిమాల్లో నిత్యం బిజీబిజీగా ఉండి సమయం కేటాయించ లేక పోవటంతో సుహాసిని ఎక్కువ సమయం సోదరుడు జానికిరామ్ తోనే ఉండేదట. జానకిరామ్ కు సుహాసినికి ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమ అభిమానం కూడా. నాడు ఏ విషయంలోనూ సుహాసిని తన అన్నమాట జవదాటేది కాదట. 


అయితే వ్యాపార అవసరాల రీత్యా జానకిరామ్ కు డబ్బు అవసరం వస్తే సుహాసిని తనకి సంబంధించిన ఆస్థులను బ్యాంకులో తనఖా పెట్టి ఆ అవసరం తీర్చారట. అయితే అనుకోకుండా, జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బ్యాంకు రుణాలు తీర్చడం ఆమెకు అతి పెద్ద సమస్యగా మారిందట. 


బ్యాంకు ఋణాల విషయంలో వచ్చిన వత్తిడిని కుటుంబ సభ్యులకు చెప్పినా ఎవరూ వాటిని పరిష్కరించటానికి ముందుకు రాలేదట. ఆ సమయంలో మామయ్య  చంద్ర బాబు నేరుగా రంగంలోకి దిగి సుహాసినిని అప్పుల ఊబి నుంచి బయట పడేశారని అంటున్నారు. సుహాసిని అందుకే జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల కంటే చంద్రబాబుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. 
Image result for kukatpally constituency Vs Nandamuri suhasini
టి-టీడీపీ నేతలు కూకటపల్లి లేదా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి నందమూరి కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరారట.  అంతేకాదు హీరో కళ్యాణ్ రామ్ తో కూడా చర్చించారు. అయితే తనకి ప్రస్తుతం రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి లేదని ఆయన తేల్చిచెప్పేశారట.
Image result for nandamuri suhasini & janakiram
తాను ఇంకా తన తండ్రి హరికృష్ణ మరణం నుంచి కోలుకోలేదని అయినా ఇంకా పది, పదిహేను సంవత్సరాలు సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్లు మనసులో మాట చెప్పేశారట. దీంతో దివంగత జానికిరామ్ భార్యను కూడా సంప్రదించారట. ఆమె కూడా ఆసక్తి చూపకుండా, తన ఆడపడుచు సుహాసిని పేరు సూచించినట్లు సమాచారం. 
Image result for kukatpally constituency Vs Nandamuri suhasini
చంద్రబాబు దానితో తన రాజకీయ విన్యాసానికి సుహాసినిని లక్ష్యం చేశారట.  సుహాసినికి టిక్కెట్ ఇస్తే నందమూరి అభిమానుల అభిమానంతో పాటు హరికృష్ణ కుటుంబా న్ని  దగ్గర చేసుకొని వారిని ఆదుకున్నామన్న సంకేతాలు ప్రజల్లో బలంగా పంపించవచ్చని ఆయన భావించారట. 


అలాగే కూకటపల్లి నియోజకవర్గంలో 'ఆంధ్రా సెటిలర్స్' ఓట్లు ఎక్కువగా ఉండటం, హరికృష్ణ మృతి చెందడంతో, ఆ సానుభూతి కలిసి వస్తుందని ఆలోచించారట. 
ఈ నేపథ్యంలో సుహాసిని అభ్యర్ధిత్వాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె అభ్యర్ధిత్వాన్ని తొలుత కుటుంబ సభ్యులు అంగీకరించ లేదట. సుహాసిని సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఆమెను పోటీ చేయోద్దని వారించారట కూడా. 
Image result for kukatpally constituency Vs Nandamuri suhasini
అయితే చంద్రబాబు అవసరానికి సహాయంచేసి ఉండటంతో చాకచక్యంగా చక్రంతిప్పి కుటుంబసభ్యులపై వత్తిడితెచ్చి మరీ సుహాసిని ఒప్పించారట. వెంటనే సుహాసినికి కూకటపల్లి నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలుగా పోటీచెసేందుకు లైన్ క్లియర్ చేశారట. శనివారం సుహాసిని కూకటపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నారు. 

Image result for kukatpally constituency Vs Nandamuri suhasini

మరింత సమాచారం తెలుసుకోండి: