స‌బ్బం హ‌రి.. ఇటీవ‌లకాలంలో టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబుకు ఉన్న భ‌జ‌న బృందంలో చేరిన కొత్త నాయ‌కుడు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి స‌బ్బం హ‌రివారు జోస్యం చెబుతున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను తిట్ట‌డంలోను, చంద్ర బాబును పొగ‌డ‌డంలోనూ ఆయ‌న‌ను మించిన వారు లేర‌నే రేంజ్‌లో వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయ‌న ఇదేత ర‌హాలో రెచ్చిపోయారు. జ‌గ‌న్‌పై విశాఖ విమానాశ్ర‌యంలో కోడిక‌త్తితో జ‌రిగిన హ‌త్యాయత్నాన్ని ఆ పార్టీ నేత‌లు వ‌దిలేయా ల‌ని చెప్పుకొచ్చారు. దానినే ప‌ట్టుకుని వేలాడితే.. పార్టీ ప‌రువు పోతుంద‌ని స‌బ్బం వారు ఉవ‌చించారు. అదేస‌మయంలో ఆయ‌న చంద్ర‌బాబు చేసిన భ‌జ‌న అధిరిపోయింది. ఆయ‌న రాష్ట్రం కోస‌మే ఉన్నార‌ని, ఆయ‌న లేక‌పోతే.. రాష్ట్రం ఇబ్బందులు ప‌డుతుంద‌ని చెప్పుకొచ్చారు. 

Related image

కోడి కత్తి ఘటనలో ముందు వైసీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడడం వల్లే టీడీపీ నాయకులు మాట్లాడాల్సి వచ్చిం ది. వైసీపీ అధ్యక్షుడిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటన ముగిసిన అధ్యాయం -అని తీర్మానం చేసేశారు హ‌రి గారు. కోడికత్తిపై ప్రజలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారని, అపరిపక్వతతోనే శ్రీనివాసరావు జగన్‌పై దాడి చేశాడని, జగన్‌ పై ఉన్న ఇష్టం... జగన్‌కు ప్రజల్లో సానుభూతి పెంచేందుకే తాను దాడి చేసినట్టు స్వయంగా శ్రీనివాసరావు పేర్కొ నడమే దీనికి నిదర్శనమ‌ని హ‌రివారు చెప్పుకొచ్చారు. ఘటన జరిగిన వెంటనే జగన్‌ కూడా దీనిని పెద్దగా పట్టించుకోకుం డానే విమానం ఎక్కి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు .. సో.. ఇక‌, దీనిని వ‌దిలేయొచ్చ‌న్న కోణంలో బాగానే విన్న‌వించారు హ‌రిగారు. 


అదే స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబుపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. రాజకీయ ప్రయోజనం పొందాలనే భావనతో వైసీపీ నేతలు ఆరోపణలు చేయడంతో కోడిక‌త్తి ఘ‌ట‌న‌పై టీడీపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించాల్సి వచ్చింది. రాష్ట్రంలో హత్యారాజకీయాలు లేవు. తన హత్యకోసం చంద్రబాబు కుట్రపన్నారని జగన్‌ ఆరోపించడం పూర్తిగా అసంబద్ధం అని చెప్పుకొచ్చారు. ఇక‌, చ‌ద్ర‌బాబు కృషితో రాష్ట్రం వెలిగిపోతోంద‌ని చెప్పుకొచ్చారు. కేంద్రాన్ని ఢీ కొట్టిన బాబుకు ప్ర‌జ‌లు సైతం నీరాజ‌నాలు ప‌డుతున్నార‌ని చెప్పుకొచ్చారు. ఇలా మొత్తానికి స‌బ్బం హ‌రి టీడీపీ నాయ‌కుడిని మించిపోయిన రేంజ్‌లో బాబుకు బాగానే భ‌జ‌న చేశార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 


ఇక స‌బ్బం బాబు భ‌జ‌న ఇంత‌లా నెత్తికెత్తుకోవ‌డంపై వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నార‌నే ప్ర‌చారం చాలా కాలం నుంచి వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో సబ్బం హరి టిడిపి నుంచి అనకాపల్లి లేదా విశాఖపట్నం లోక్‌స‌భ సీట్లలో ఏదో ఒక సీటు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని టాక్. అదే సమయంలో విశాఖపట్నం నియోజకవర్గం నుంచి కూడా ఆయన అసెంబ్లీ బరిలోకి దింపాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు స‌బ్బం బాబు భ‌జ‌న భుజానికి ఎత్తుకున్న‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: