ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ ఆ మద్య కోదడ నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారు.  ఇందుకు సంబంధించి  రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు..కానీ అది సరిగా లేకపోవడంతో రిజక్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా, నేడు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు.  తన మద్దతుదారులతో కలసి వచ్చిన ఆయన  నామినేషన్ దాఖలు చేశారు. 

వేణు మాధవ్ స్వస్థలం కోదాడ కావడంతో ఆయన ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.  అయితే వేణు మాధవ్ కొంత కాలంగా చిత్రాల్లో నటించడం లేదు. వేణు మాధవ్ మొదటి నుంచి టీడీపికి వీర అభిమాని కావడమే కాదు పార్టీ ప్రచారాల్లో కూడా చురుగ్గా పాల్గొనే వారు.  ఆ మద్య ఏపిలో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతపై ఎన్నో కాంట్రవర్సీ వ్యాఖ్యలు కూడా చేశారు. 

వాస్తవానికి టీడీపీ తరుపు నుంచి పోటీ చేయాలనుకున్నా..ప్రస్తుతం మహాకూటమి నేపథ్యంలో సీట్ల సర్థుబాటులో ఆ ఛాన్స్ దక్కలేదు.  దాంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నేడు ఈసీ నిర్దేశించిన విధంగా ఆయన నామినేషన్ పత్రాలను తయారు చేయించి తీసుకురావడంతో, వాటిని పరిశీలనకు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: