తెలంగాణలో ఎన్నికల జోరు కొనసాగుతుంది.  నేటిలో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రస్తుతం టీఆర్ఎస్ ముమ్మర ప్రచారం కొనసాగిస్తుంది.  ఇక తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఓడించాలన్న పట్టుదలతో టి కాంగ్రెస్, టిటిడిపి, టిజెఎస్, సిపీఐ లు కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసొందే.  కాకపోతే మహాకూటమిలో సిట్ల సర్దుబాటు విషయంలో మాత్రం ఎవరికి వారే గట్టిపట్టుమీద ఉన్నారు.  మొత్తానికి మహాకూటమిలో అన్ని సర్ధుబాటు చేసుకొని నామినేషన్లు వేశారు.  కాగా, టీఆర్ఎస్ అధినేత ఆపద్ధరమ్మ ముఖ్యమంత్రి నేడు ఖమ్మం పర్యటించారు.  ఖమ్మం జిల్లా గొప్ప పోరాటాల గడ్డ అనీ, అనేక తలపండిన రాజకీయ నాయకులు ఇక్కడే పుట్టారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.


నిజాలు చెబితే కొంత మందికి నిష్టూరంగా ఉంటుందని..కానీ నిజాలు మాట్లాడేవాడే నిజమైన నాయకుడు అని అన్నారు.   ఖమ్మంలోని పాలేరులో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఈసారి టీఆర్ఎస్ మొత్తం 10కి పది స్థానాలను గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కులాల కుళ్లు, దొంగ డబ్బు ప్రవాహం, గజకర్ణగోకర్ణ టక్కుటమారా విద్యలు చాలా ఉంటాయని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉచిత కంటివైద్య శిబిరం పెట్టినట్లు వెల్లడించారు. దీంతో ఆ చిన్నఊరిలోనే 227 మంది చికిత్స కోసం వచ్చారని పేర్కొన్నారు. అందుకోసమే కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చామని కేసీఆర్ అన్నారు. స్థానిక సమస్యల ఆధారంగానే తమ పథకాలు పుట్టాయని వ్యాఖ్యానించారు. 


ఈ మద్య కొంత మంది తనకు ప్రశ్నలు సందిస్తున్నారు..‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చెప్పినవన్నీ కట్టారా? దళితులకు మూడెకరాలు ఇచ్చారా? ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్ ఏడు ఇళ్లు కలిపితే..ఒక్క డబులు బెడ్ రూమ్ అని అలాంటి హంగులతో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేపట్టామని అన్నారు.  ఇప్పుడు రాష్ట్రంలో 2.70 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో అప్పులు చేసి ఇళ్లు కట్టుకోవాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు తాము కడుతున్న ఇల్లు రెండు తరాల పాటు నిలుస్తుందన్నారు. వీటి నిర్మాణం 6 నెలలు ఆలస్యమైతే కొంపలేవీ మునిగిపోవని వ్యాఖ్యానించారు.  


కాంగ్రెస్ పార్టీలో మహానుభావాలు, అంతర్జాతీయ మేధావులు ఉన్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. విద్యుత్ ను 9 గంటలు కూడా ఇవ్వలేని కాంగ్రెస్, టీడీపీ నేతల మేధావితనం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.  కాంగ్రెస్, టిడిపి హయాంలో తన పొలంలో కూడా మోటార్లు కాలిపోయాయని గుర్తుచేసుకున్నారు. ప్రజలు కులం, మతం ఆధారంగా కాకుండా వాస్తవాల ఆధారంగా ఓటు వేయాలన్నారు. కులం, మతం ఆధారంగా ఎవ్వరూ బాగుపడలేదన్నారు. కులాలు, మతాలు ఎవ్వరికీ అన్నం పెట్టవని సీఎం అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: