Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 6:37 am IST

Menu &Sections

Search

ఎడిటోరియల్: అందుకే చంద్రబాబు జాతీయపార్టీల చుట్టూ తిరుగుతున్నాడా?

ఎడిటోరియల్: అందుకే చంద్రబాబు జాతీయపార్టీల చుట్టూ తిరుగుతున్నాడా?
ఎడిటోరియల్: అందుకే చంద్రబాబు జాతీయపార్టీల చుట్టూ తిరుగుతున్నాడా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కొన్ని పత్రికలు గగ్గోలుపెడుతూ ప్రచారం చేస్తున్నట్లు చంద్రబాబు గారి నో ఎంట్రి ఫర్ సిబీఐ వార్త దేశంలో ప్రకంపనలు ఏమీ సృష్టించట్లేదు కారణం "చంద్రబాబు చెప్పే సమూహం " మొత్తం తొలినుండి నరేంద్ర మోడీ వ్యతిరేఖ వర్గమే. ఈ సమూహంలోని ప్రతి ప్రాంతీయ పార్టీ అధినేత అదృష్టముంటే వెంటనే లేకుంటే ఏదో ఒకనాటికి భారత ప్రధాని కావాలన్న తహతహ ఉన్నవారే. 


వాళ్ళు అందరూ ఇప్పటికే నరేంద్ర మోడీతో విడివిడిగా మొట్టికాయలు తిన్నోళ్ళే. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు నారా ఛంద్ర బాబు నాయుడు ఇప్పటి వరకు “ఎన్డిఏ” మాటున చక్కగా బ్రతికి బయటకు వచారు. వచ్చీరాగానే ఈయన గారికి తెమ్మిరి వదిలి అప్పుడు తెలిసొచ్చింది మోడీ దెబ్బంటే ఏమిటో? బాదలు పంచు కోవటానికి, తన ఊకదంపుడు ప్రచారానికి ప్రతిద్వనిగా గొంతుకలిపే తోడు కావాల్సివచ్చింది. 

babu-ap-news-modi-vs-all-chandrababu-opposition-unity

చేసిన పాపాలు ఇంత వరకు ‘కేంద్ర ప్రభుత్వ నీడ’ లోనే చేశాడు. పాపం చేసిన వాడి మనసు ఎప్పుడూ తొలుస్తూనే ఉంటుంది. నిన్నటి వరకు తన మిత్రపక్షం కాబట్టి  చూసీ చూడనట్లున్న కేంద్రం, ఇప్పుడు చంద్రబాబును తన శతృవర్గంలో వారిని “ఎలా హాండిల్ చేస్తుందో”  చంద్రబాబును అలాగే చూడటంతో ఒక్క సారిగా రక్షణ కోల్పోయిన వారిలా "డిప్రెషన్ లేదా ఆత్మ న్యూనత”  గురవగా, చేసే నిర్ణయాలు ‘బూమరాంగ్’  అవుతున్నాయి. 


తన హృదయ దౌర్బల్యాన్ని లోపలే దాచుకొని పైకి గంభీరంగా ప్రవర్తిస్తూ ధర్మపోరాటం, న్యాయ పోరాటం అంటూ విచ్చల విడి కార్యక్రమాలు నిర్వహిస్తూ, వాటికి ప్రజా ధనం నీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తూ - నరేంద్ర మోడీకి నిలువరించాలన్న తపనతో ఆయనకు వ్యతిరేక్షంగా, ప్రతిపక్షాల ఐఖ్యత అంటూ రాష్ట్రం పాలన గాలికి వదిలేసి కొత్త బిచ్చగాడులా ఇతర రాష్టాల చుట్టూ  దేశ దిమ్మరిలా తిరుగుతున్నాడు.

babu-ap-news-modi-vs-all-chandrababu-opposition-unity
ఈయన ఇంటింటికి వెళ్ళి ఈమద్య కలిసిన దురాశాపరులంతా ఇప్పటికే మోడీ వ్యతిరేఖ ప్రభంజనాన్ని దేశంలో సృష్టింప జూసేవాళ్ళే. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న పది మంది ప్రాంతీయ ప్రతిపక్ష వూండెడ్ సోల్జర్స్ అవకాశం కోసం చూస్తున్న నాయకులను కలుపుకొని డిల్లీలో నాటకాలు వేస్తుంటే: అసలే మోడీ! మొండోడు. అందులో పట్టుదల ఉన్నోడు అంతకు మించిన కార్యసాధకుడు. భార్య, సంతానం అనే భవబంధాలు, బాదర బందీ లేని ఏకాకి ఊర్కొంటాడా? ఎంత వరకైనా వెళ్తాడు. అందులో ఎక్కడో ఎందు లోనో దొరికిపోయిన చంద్రబాబు లాంటి వాణ్ణి, మోడీ లాంటి వాడు వదిలెయ్యటం అసంభవం. "ఆపరెషణ్ ద్రవిడ, గరుడ, రాక్షస, కుమార" పేర్లతో నాటకాలేసి దాన్ని కేంద్రంపై నెట్టేసి దేశవ్యాప్తంగా ఉన్న వూండేడ్  సోల్జర్స్ తో నాటకాలేస్తే మోడీకి తెలుసు ఏలా వేటాడాలో?     దేశ విదేశాలు తిరుగుతూ విలాసాలతో అక్కడ - రోడ్లపై పోరాటాలు అంటూ ఇక్కడ - ప్రజాధనం విచ్చలవిడిగా వృధా చేస్తూ ప్రజలకు ఏ విధంగానూ ప్రయోజనమివ్వని పనికిరాని పోరాటాల వార్తలు, విశ్లేషణలను తమ సామాజికవర్గ నేతృత్వం వహించే మీడియా హౌజులు – వాళ్ళ డబ్బాల్లో, గొట్టాల్లో చేయనిపనులు చేసినట్లు చూపిస్తూ, ఒక అక్రమార్కుణ్ణి విక్రమార్కుడని చెపుతూ హోరెత్తించినా ప్రయోజనం ఏమీ కలగకపోగా వీళ్ళ వార్తలతో ఎంతొ కొంత  ఉన్న గతకాలపు మంచి మంచులా కరిగి పోగా పేరు తునాతునకలై చంద్రబాబు తాను చేస్తున్న గారడీ తనకే దెబ్బగొట్టటం గమనించట్లేదు. 
babu-ap-news-modi-vs-all-chandrababu-opposition-unity
తాను నిప్పని తనకొడుకు మగానుభావుడని, తన ఎంపీలు, ఎమెల్యేలు, మంత్రులు దేశసేవలో తరించిపోతూ ఉన్నారని ఊదర గొట్టిస్తూ, ప్రజాధనాన్ని దోచేస్తూ, అవినీతి తో తెలుగుజాతి సంపదను దోచేస్తూ తిరిగి కేంద్రం నిధులు యివ్వట్లేదంటూ,  కాలం కులాసంగా విలాసంగా గడిపేస్తున్నారు. 


ఇప్పటివరకు అమరావతి భూసేకరణ, భూకబ్జా, వారుణీవాహిని, ఇసుక, కల్తీ, రవాణా, విద్య, ఆరోగ్య, అటవిసంపద, భూగర్భఖనిజ సంపద, పోలవరం, పట్టిసీమ వంటి నీటిపారుదల ప్రోజెక్ట్స్ ఇలా ఎన్నో శాఖలను తమ ఆదీనంలోకి తీసుకొని తొలుత వ్యాపారంగా ఆపై మాఫియాగా మార్చేశారు. అలాగే వీటిని విస్తృతపరచటానికి సుఖభోగ విలాసాల్లో మునగటానికి సినిమా, స్త్రీలపై లైంగిక అత్యాచార మాఫియా ఉండనే ఉంది. వీరి రాచలీలలను శృంగార లీలలను కప్పిపెట్టటానికి తమ సామాజిక వర్గ పచ్చ మీడియా ఉండనే ఉంది. అయితే ఆ పచ్చనివురు గాలికి తొలగిపోయింది ఇప్పటికే సామాజిక సమాచార వ్యవస్థ దెబ్బకి పచ్చనిప్పు బయటపడి వెలవెలపోతోంది. 


బాబు తనను తాను నిప్పని చెప్పుకుంటే,  కాదు...అగ్నిహోత్రమని చెప్పే ఆయన సామాజిక వర్గ మీడియానే ఆయనకు 2019 ఎన్నికల్లో తన అతి పోకడలతో, తలకొరివి పెట్టనుందని సంకేతాలు వెలువడుతున్నాయి. ₹700 కోట్ల ప్రజాధనం టిడిపి అధినేతలనునండి నోక్కెసిందని చెప్పబడుతున్న ఒక పచ్చ మీడియా హౌజ్ సిబీఐ లోని ఇద్దరు ఉన్నతాధికారుల మద్య ఈగో క్లాషెషెస్ ను ఎలవేట్ చేసి ఫోకస్ చేయటం ఎంతైనా జాతికి హర్షనీయం కాదు. సిబీఐలోని గొడవలు గత రెండు, మూడు దశాబ్ధాల నాటివేని విశ్లేషకులు చెపుతున్నారు. వ్యవస్థలని అవస్థలపాలు చేయ్యటం కాంగ్రెస్ వారి సాంప్రదాయం. అంతే కాదు చంద్రబాబు అదే అనుసరిస్తూ తాను పతివ్రత, పత్తిత్తు అని చెప్పటం నీతిమాలినతనం కాదా? దానికి కారణం మన పచ్చపార్టీకే చెందిన సిఎం రమేష్ మిత్రుడు సతీష్ సాన లాంటివాళ్ళే అంటున్నారు. సతీష్ సాన పేరు బయటకు రాగానే పచ్చపార్టీ, నాయకులు మీడియా కలగాపులబంగా చెత్త చేసేస్తున్నాయి. 
 
babu-ap-news-modi-vs-all-chandrababu-opposition-unity
ప్రతిపక్ష బలాన్ని ప్రలోభాలను ఏరవేసి లాక్కోవటం పాతివ్రత్యమా? ఇక్కడ వైసిపి పత్తిత్తని చెప్పటంలేదు–పిల్లిని గదిలోపెట్టి చెండాదితే–అది పులై చీల్చిపారేస్తుందని అనటానికి  – నూరుశాతం సాక్ష్యమే ప్రజాబాహుళ్యంలో అతిశక్తివంతంగా మరిన వైసిపి. పదే పదే చెపితే అవే నిజాలుగా మారతాయన్నది గోబెల్ సూక్తి – అయితే – ఈ కాలానికి అవి బూమరాంగై చంద్రబాబు రాజకీయ జీవితాన్ని సమాధి చేస్తాయన్నది నేటి తెలుగు సూక్తి. పాపాల పచ్చనాయకునికి  టముకేసే పచ్చమీడియా తాను ప్రజల్లో పలచనవటంకాక, తన నాయకుని, పచ్చపార్టీని కూడా పలచన చేస్తుందన్నది పచ్చి నిజం.  


చంద్రబాబు అండ్ కో – ఇప్పటికి దోచి, దుబారా చేసి, విందు విలాసాలతో అనుభవించిన ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన తరుణం వచ్చేసింది. కేంద్ర విచారణ సంస్థ లకు అందిన సమాచారం మేరకు చంద్రబాబుగారి బృందజనులపై ఆదాయపన్ను శాఖ దాడులు జరపటంతో పుట్టల్లోని నోట్ల కట్టలతో పాటు సంపద సెలయేళ్లలా జలజలా పారి ₹800 కోట్ల అవినీతి చెలియలి కట్టను దాటింది. 

babu-ap-news-modi-vs-all-chandrababu-opposition-unity
ఇంతలో ప్రతిపక్షనేత పై హత్యాప్రయత్నం దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి - పోలీస్ బాస్ వెటకారం తో కూడిన వ్యాఖ్యలు విన్నాక దేశజనానికి  మొత్తం  అర్ధమైంది ఈ హత్యాప్రయత్నం వెనక ఉన్న దెవరనేది. ఇది కప్పి పుచ్చినా దాగదు కారణం బాధితుడు అత్యంత ప్రజాధరణ ఉన్న నాయకుడు.  మొదటి దానిని ఆదాయపన్ను శాఖ చూసుకుంటే రెండోదాన్ని సిబీఐ చూసుకోనున్న దరిమిలా లోపల ఉన్న ధైర్యం మొత్తం కారిపోగా - రానున్న ఉపద్రవం ఊహించి దాన్నుంచి తప్పించు కోవటానికి వేసిన ఎత్తే  "నో ఎంట్రీ ఫర్ సిబీఐ ఇంటూ స్టేట్"


నో ఎంట్రీ ఫర్ సిబీఐ ఇంటూ స్టేట్  అని జిఓ విడుదల చేసిన నాటి తిమ్మిరిలో అర్ధం కాలేదు కాని బాబుకు, బాబు మీడియాకు ఇప్పుడిప్పుడే తెలియబోతోంది మోడీ దెబ్బేమిటో?  ఇప్పుడు విడుదల చేసిన "నో ఎంట్రీ ఫర్ సిబీఐ" అనే జిఓ ప్రతిపక్షనేతపై ప్రభుత్వ పెద్దలే ప్రణాళిక రచించి చేసిన హత్యాప్రయత్నం కేసు ఇంతింతై వటుడింతై అన్నరూపంలోకి మారి కాలసర్పం అవుతుంది. 
babu-ap-news-modi-vs-all-chandrababu-opposition-unity

జనం దృష్టి తప్పించటానికే నో ఎంట్రీ ఫర్ సిబీఐ అని జనాలకే అర్ధమైనది. బాబుగారు తనతప్పుల కుప్పాలు తన నిప్పుతోనే దహించటానికి తెచ్చిన నో ఎంట్రీ ఫర్ సిబీఐ తనకే చుట్టుకోనున్నదని దేశరాజధానిలో వినిపిస్తున్న మాట.  పచ్చ మద్దతు మీడియా రాసే కథలు కూడా ముసుగులు తొలగించుకొని అర్ధమవుతుండగా బిజేపి రాష్ట్రానికి చేసిన అన్యాయానికి కారణం చంద్రబాబు తీరేనని బలంగా రాష్ట్ర ప్రజాబాహుళ్యానికి తెలుస్తుండగా - చంద్రబాబు పీడ ఎప్పుడు వదిలించాలంటూ  2019 ఎన్నికల కోసం జనం నిరీక్షిస్తున్నారు.  


ఏదో జరగబోతోందని చంద్రబాబులో భయాందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. అందుకే సీబీఐ విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాడు. అది చెల్లదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి అసలు కథ ఏమిటో? కానీ, బోను లో తోక ఇరుక్కోగా విలవిల్లాడే ఎలుకలా గిలగిల కొట్టుకుంటున్నారు. కుడితిలో పడ్డ ఎలుకలా, చంద్రబాబు గజగజలాడుతున్న తీరు మాత్రం సుస్పష్టం.
babu-ap-news-modi-vs-all-chandrababu-opposition-unity

అందుకే కొత్త బిచ్చగాడు తెల్లవారక మునుపే బొచ్చెతీసుకొని ఊళ్ళోపడ్దట్టు వేళగాని వేళ కర్ణాటక, పశ్చిమ బంగ, తమిళ నాడు లోని ఊండెడ్ సోల్జెర్స్ ను కలవటానికి వెళితే అక్కడ మర్యాదనే  ఇది బిచ్చం వెసే సమయం కాదు బాబూ!  తరవాత చూద్ధాం!  అంటూ ముచ్చటగా తరిమేశారు.  కొత్తబిచ్చగాడులా కొంపవదిలేసి ప్రతిపక్షఐఖ్యత అంటూ బిచ్చమెత్తుకుంటున్న చంద్రబాబు రాష్ట్రంలో తన పునాదులు కదులుతున్నాయని గమనించితే మంచిది. ఇక ఏపి పచ్చ మీడియా దాన్ని చెరిగి, అందులోని మెరిగలు వేరేసి, అవమానం పాళ్ళు తొలగించి, మాబాబు ఏప్పటికైనా మహరాజే!  ఇక డిల్లీ దర్బారులో చక్రం తిప్పుతారని అంటూ స్వభుజాలు తడుముకుంటూ వార్తలు వండేస్తున్నారు.   

babu-ap-news-modi-vs-all-chandrababu-opposition-unity
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author