గత గురువారం నామినేషణ్ల గడువుముగియగా, 28 నవంబర్ రోజున ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ లో మొత్తం 230 శాసనసభాస్థానాలకు 2907 మంది బరిలో నిల బడ్దారు. ఇక్కడ గత 15 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా, ఇప్పుడు ముదిరిన యాంటి-ఇంకంబెన్సీ తో బిజెపి విజయావకాశాలను కాంగ్రెస్ పార్టీ గుంజుకొనుందన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది. భిండి జిల్లా మెహగావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 34 మంది సభ్యులు బరిలో పోటీ పడుతుండగా, అతితక్కువగా నలుగురు మాత్రమే పన్నా జిల్లా గున్నోర్ నియోజకవర్గంలో పోటీ పడుతున్నారని ఎన్నికల సంఘం తెలిపింది.  
Image result for madhya pradesh
మధ్యప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్జున యాదవ్ స్వయాన ప్రతిష్టాత్మక రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమరంలో పోటీపడనున్నారు.మొత్తం 1102 మంది సభ్యులు స్వతంత్ర సభ్యులుగా పోటీ పడుతున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 230 స్థానాల్లోను బిజెపి పోటీ చేస్తుండగా - కనీసం 200 స్థానాల్లో గెలుపు సాధించాలనే అంశాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన పార్టీ ప్రతినిధులకు కార్యకర్తలకు ఆదేశించారు.
Image result for madhya pradesh assembly now

బిజెపి అధికార ప్రతినిధి రజనీష్ అగర్వాల్ మాట్లాడుతూ తాము ఇప్పుడు ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పరచగలమని ఉద్ఘాటించారు. గతంలో 207 స్థానాల్లో బిజెపి గెలిచిన ఉదంతాన్ని గుర్తుచేస్తూ తాము "అబ్ కి బార్ దో సవ్ పార్" అనే ఎన్నికల నినాదాన్ని నెలక్రితమే కార్యకర్తల సభలో తమ అధినేత అమిత్ షా ఉటంకించినట్లు చెప్పారు. 
Image result for madhya pradesh assembly now
కాంగ్రెస్ తాము ఎన్నికలకు ముందు మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ మరియు అఖిలేష్ యాదవ్ నేతృత్వం వహించే సమాజ్ వాదీ పార్టీతో విఫల పొత్తు పెట్టుకుని ఆ తరవాత శరద్ యాదవ్ నేతృత్వంలోని లోక్ తాంత్రిక్ జనత డల్ పార్టీతో పొత్తుకు దిగిందని. ఇప్పుడు కాంగ్రెస్ 229 స్థానాల్లో తన అభ్యర్ధులను నిలబెట్టి ఒక టికంగర్ జిల్లాలోని జాతర స్థానాన్ని ఎల్జెడి కి కేటాయించింది. అంటే దాదాపు ఒంటరి పోరాటమే. పంకజ్ చతుర్వేది కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాత్రం ఈ సారి తామే 150 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 15యేళ్లలో బిజెపి తమ వ్యర్ధ వాగ్ధానాలతో ప్రజలకు చేరువ కాలేక పోయిందని ఆయన  అన్నారు. 
Image result for madhya pradesh assembly now
మాయావతి పార్టీ బిఎస్పి 227, అఖిలేష్ ఎస్పి 51 మందిని ఎన్నికల బరిలో పోటీకి నిలపింది. ప్రదీప్ అహిర్వార్ బిఎస్పి అధికార ప్రతినిధి మాట్లాడుతూ దళిత ఐఖ్య వేదిక తమకోసం కనీసం 32 స్థానాల్లో విజయాన్ని చేకూర్చగలిగేలా పోరాడుతుందని ధీమాగా చెప్పారు. జగ్దేవ్ సింగ్ యాదవ్ సమాజ్-వాది అధికార ప్రతినిధి తమకు 10స్థానాల్లో సంపూర్ణ బలముందని అవి బుందేల్ ఖండ్, చంబల్, బాలఘాట్ ప్రాంతాల్లో ఉన్నాయని అన్నారు.  ఇక తొలిసారి ఇక్కడ పోటీ పడుతున్న 'ఆం ఆద్మీ పార్టీ' కూడా 208 స్థానాల్లో సభ్యులని నిలిపి రణరంగంలో తన అదృష్టాన్ని పరిశీలించుకుంటుంది.
Image result for madhya pradesh assembly now
గత శాసనసభ ఎన్నికల్లో 230 స్థానాలకు గాను 165 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 58, నాలుగు బిఎస్పి, మూడు స్వతంత్ర అభ్యర్ధులు శాసనసభ సభ్యత్వాలను కలిగిఉన్నారు. ఇక 5,04,95,251 ఓటర్లలో పురుషులు 2,63,01,300 స్త్రీలు 2,41,30,390 థర్డ్ గెండర్ 1389 మంది ఉన్నారు. వీరికి అదనంగా 62,172 మంది పోస్టల్-బాలెట్ ద్వారా ఎన్నికల్లో తమ వోటు హక్కు వినియోగించుకుంటున్నారు.  
Image result for madhya pradesh assembly now    

మరింత సమాచారం తెలుసుకోండి: