పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘ప్రజాపోరాట’ యాత్రలో ఎవరు ఊహించని విధంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త భారతదేశంలోని రాజకీయ నాయకులను సాసించే అత్యంత ప్రముఖ వ్యక్తుల కుటుంబం అంబానీలకు వార్నింగ్ ఇవ్వడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో జరిగిన రైతుల సమావేశంలో పవన్ నోటివెంట ఈ ఘాటైన వ్యాఖ్యలు వచ్చాయి. 
 ఎక్కడకు వెళ్లినా ఒకటే ప్రశ్న
రైతులకు అండగా నిలవలేని లేని ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నిస్తూ రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఎక్కడ చూసినా రైతు కంట కన్నీళ్ళు కనపడుతున్నాయని వేదన వ్యక్త పరిచాడు. రాబోయే రోజుల్లో ‘జనసేన’ తరఫున అన్నదాతల కోసం ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తామని చెపుతూ ఆ సదస్సుల్లో వారి సమస్యలపై చర్చిస్తామని హామీ ఇచ్చాదు పవన్.
 ఆ తెలంగాణ రైతు కన్నీరు పెట్టాడు, ఇంకా గుర్తుకు ఉంది
అంతేకాదు  ప్రపంచీకరణ పేరుతో వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నారని రైతులకు కావలసింది సింగపూర్ కాదు అంటూ ఘాటైన సెటైర్లు వేసాడు పవన్ కళ్యాణ్. ఇదే సందర్భంలో కోనసీమ ప్రాంతంలో అంబానీలు కొనసాగిస్తున్న చమురు గ్యాస్ నిక్షేపాల దోపిడీ గురించి మాట్లాడుతూ అంబానీల వల్ల కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండే కొబ్బరి తోటలు నేలమట్టం అవుతున్న విషయాన్ని ఆవేశంగా గుర్తుకు చేసాడు పవన్. 
 à°œà°¨à°¸à±‡à°¨à°¨à± ప్రజల ముందుకు తీసుకు రావడం సాహసోపేతమైన చర్య
కోనసీమ ప్రాంతం నుండి అంబానీలు బడా పారిశ్రామిక వేత్తలు గ్యాస్ మరియు చమురును దోపిడీ చేసి పట్టుకుపోతూ ఉన్నా ఆదోపిదీని ఆపే శక్తి  ఏ రాజకీయ నాయకుడుకి లేదు అంటూ తన ‘జనసేన’ అధికారంలోకి వస్తే కోనసీమ ప్రాంతంలో అంబానీలు చేస్తున్న దోపిడీని తాను అడ్డుకుంటాను అంటూ గట్టి సవాల్ విసిరాడు పవన్. మన గ్యాస్ చమురు నిక్షేపాలలో మన షేర్ మనకు రావాలి అని పవన్ చేస్తున్న పోరాటానికి కోనసీమ ప్రాంత ప్రజల మద్దతు లభిస్తే రానున్న ఎన్నికలలో ‘జనసేన’ కు కోనసీమ ప్రాంతంలో చాల విజయావకాశాలు ఉంటాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: