తెలంగాణలో వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రచారాలు ఊపందుకున్నాయి.  ఇక ప్రజలకు తమ పార్టీపై నమ్మకం కలిగించేలా అధినేతలు రంగంలోకి దిగారు.  టీఆర్ఎస్ తరుపు నుంచి కేసీఆర్, కాంగ్రెస్ నుంచి ఈ మద్య సోనియా గాంధీ, రాహూల్ గాంధీ సైతం మేడ్చల్ మీటింగ్ లో పాల్గొన్నారు.  ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయనకు పోటీగా కాంగ్రెస్ తరుపు నుంచి  ఒంటేరు ప్రతాపరెడ్డి నిల్చున్న విషయం తెలిసిందే.
Image result for vonteru pratap reddy
అయితే కేసీఆర్ పై పోటీ చేస్తున్నందుకు తనపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని..ఆత్మహత్య యత్నం చేసుకున్న విషయం తెలిసిందే.  ఓ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..గత నాలుగున్నరేళ్లలో తనపై 23 కేసులను ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టించారని గజ్వేల్ లో ఆయనపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి మండిపడ్డారు. మల్లన్నసాగర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే... ఫైరింగ్ చేయడమే కాకుండా, 42 మందిపై కేసులు పెట్టారని తెలిపారు. రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ కేసీఆర్ ఫ్యామిలీకి అనుకూలంగా పని చేస్తోందని ఒంటేరు ఆరోపించారు.
Image result for kcr
గజ్వేల్ నియోజకవర్గంలో గత 45 రోజులుగా హరీష్ రావు ప్రతి గ్రామంలో టెంట్లు వేసి మద్యం పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీడియోలు చూపించినా పట్టించుకోలేదని చెప్పారు. తన నివాసంలో సోదాలు చేస్తున్నామంటూ ఇల్లంతా చిందరవందర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మీదే పోటీ చేస్తావురా? ఎంత ధైర్యంరా నీకు? నీ వెనుక ఎవరున్నార్రా? అంటూ భయానక వాతావరణం సృస్టించారని అన్నారు.  ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని..నిరంకుశ పాలనకు స్వస్తి పలకాలని..ప్రజల బాగోగులు చూసే పార్టీకి ఓటు వేయాలని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: