తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నాయకుల కప్పుల తక్కెడలు మామూలుగా లేవు. ఈ పార్టీలో సీటు రానివారు ఆ పార్టీలోకి... ఆ పార్టీలో సీటు రానివారు ఈ పార్టీలోకి జంప్‌ చేస్తూనే ఉన్నారు. ఎన్నికల తేదీ వచ్చినప్పటి నుంచే కాదు నామినేషన్ల పర్వం ప్రారంభం అయ్యి ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది కూడా ఈ జంపింగులు జోరుగానే సాగుతున్నాయి. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఐడీసీ ఛైర్మెన్‌ బుడాన్‌ బేగ్‌ టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చి టీడీపీలోకి జంప్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.
Image result for khammam map
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పలువురు కీలక నేతలు కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడెనిమిది రోజుల టైమ్‌ మాత్రమే ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడు కూడా కీలక నేతలు జంపింగ్‌ చేస్తుండడం అక్కడ రాజకీయాన్ని మరింత హీట్‌ పుట్టిస్తోంది. ఇక ఏపీలో ఎన్నికల వేడి స్టార్ట్‌ అవ్వడంతో ఇక్కడ కూడా ఈ పార్టీలో సీటు రాని నాయకులు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో సీట్లు రాని నాయకులు ఈ పార్టీలోకి జంప్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


ఇప్పటికే తాము ఉన్న పార్టీలో సీటుపై సందేహంతో ఉన్నావారు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్టే తెలుస్తోంది. ఏపీలో అధికార టీడీపీ నుంచి అసంతృప్తితో ఉన్నకొంత మంది ఎమ్మెల్యేలు విపక్ష వైసీపీలోకి జంప్‌ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత సాధారణ ఎన్నికల తర్వాత విపక్ష వైసీపీ నుంచి ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరికి అప్పట్లో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సీటుపై హామీ ఇవ్వడంతో పాటు అనేక రకాల ప్రలోబాలు పెట్టారని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మందికి ఇప్పుడు టీడీపీలో టిక్కెట్లు దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ లిస్ట్‌లో ఏకంగా పది మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారంటే చంద్రబాబు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏ రేంజులో షాక్‌ ఇవ్వబోతున్నారో అర్థం అవుతోంది.


ఎమ్మెల్యేల పని తీరు బాగోలేదని కొంత మందిని, సమీకరణల నేపథ్యంలో మరికొందరిని, ఆర్థిక కోణాల నేపథ్యంలో మరికొందరిని పక్కన పెట్టాలని బాబు డెసిషన్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారిన వారిలో విజయ‌వాడ వెస్ట్‌ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, కదిరి ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా ఇలా కొంద మంది పేర్లు ముందు నుంచి టిక్కెట్లు రావన్న వారి లిస్ట్‌లో వినిపిస్తున్నాయి. ఇక కర్నూలు జిల్లాతో పాటు ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సైతం టీడీపీలోకి జంప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిలో టిక్కెట్లు రానివారిలో ఓ నలుగురు తిరిగి వైసీపీలోకి రివర్స్‌ జంపింగ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరికి వచ్చే ఎన్నికల్లో జగన్‌ టిక్కెట్‌పై స్పష్టమైన హామీ ఇస్తేనే వీరు పార్టీ మారాలని డిసైడ్‌ అయ్యారట. 


గత ఎన్నికల్లో టిక్కెట్‌ ఇస్తే గెలిచాక తనకు షాక్‌ ఇచ్చి టీడీపీలోకి వెళ్లిన వారిని ఇప్పుడు జగన్‌ తిరిగి పార్టీలో చేర్చుకుంటారా ? అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీకి షాక్‌ ఇచ్చి టీడీపీలోకి వెళ్లి ఇప్పుడు తిరిగి ఆపరేషన్‌ స్వగృహా పేరుతో రీ ఎంట్రీ ఇస్తున్న ఎమ్మెల్యేలు కొంత మంది.... టీడీపీలో సీట్లు రావని డిసైడ్‌ అయిన వారిలో మరి కొందరు సైతం ఇప్పుడు వైసీపీ వైపే చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఏపీలో ఎన్నికల టైమ్‌ దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీకి షాకుల మీద షాకులు తప్పేలా లేవు. ఆ పార్టీ నుంచి పలువురు ఎంపీలు వైసీపీ, జనసేనలోకి వెళ్లిపోయేందుకు ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: