డీఎల్ ర‌వీంద్రారెడ్డి. పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన డీఎల్‌.. రాజ కీయాల్లో వైఎస్‌నే ప్ర‌శ్నించిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్లో చ‌క్రం తిప్పిన డీఎల్‌.. రాష్ట్ర విభ‌జ న‌, కాంగ్రెస్ అడ్ర‌స్ లేకుండా పోవ‌డం వంటి కార‌ణాల‌తో సైలెంట్ అయిపోయారు. అయితే, గ‌తంలో మాత్రం ఆయ‌న సెంట‌రాఫ్‌ది పాలిటిక్స్‌గా మెలిగారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత డీఎల్ రవీంద్రారెడ్డి. మైదుకూరు నియోజకవర్గం నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 

Image result for congress

నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు. కిరణ్‌ మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆయనతో డీఎల్ విభేదించారు. క్యాబినెట్‌లో ఉంటూనే ముఖ్యమంత్రులకు ముచ్చెమటలు పట్టించారు. అయితే ముక్కుసూటిగా వ్యవహరించే, నిజాయి తీపరుడిగా పేరున్న డీఎల్‌.. ఎప్పుడు ఏ పార్టీనుంచి పోటీచేసినా గెలిచే సత్తా ఉందని చెబుతారు. అలాంటి నాయకుడు నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఇంటికే పరిమితమయ్యారు. ఆ మధ్య ఆయన టీడీపీ వైపు మొగ్గుచూపినట్టు ప్రచారం జరిగింది. అయితే పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వకపోవచ్చనే అనుమానంతో వెనక్కి తగ్గినట్టు సమాచారం. 

Image result for dl ravindra reddy

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీ పెద్దలు డీఎల్‌తో టచ్‌లోకి వచ్చినట్టు, ఆయనకు టిక్కెట్ హామీ ఇచ్చినట్టు చెప్పుకుంటు న్నారు. ఈ నేపథ్యంలో త్వ‌ర‌లోనే డీఎల్ పసుపు కండువా కప్పుకోవడం ఖాయమైనట్టే అంటున్నారు! ఇక‌, ప్ర‌స్తుతం మైదుకూరు ప‌రిస్థితి ఎలా ఉందో చూస్తే.. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన శెట్టిప‌ల్లి ర‌ఘురామిరెడ్డి విజ‌యం సాధించారు. అదే ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కేవ‌లం 11 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే, మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచే పోటీ చేయాల‌ని పుట్టా కోరుతున్నారు. 


అయితే, ఆయ‌న‌కు ఇప్ప‌టికే టీటీడీ చైర్మ‌న్ గిరీ ఇవ్వ‌డంతో టికెట్ ఇచ్చే విష‌యం పెండింగ్‌లో ఉంది. పైగా ఈయ‌న‌కు ఆయ‌న వియ్యంకుడు య‌న‌మ‌ల స‌పోర్టు ఉంది. ఇక‌, ఇదే టికెట్‌ను డీఎల్ కూడా ఆశిస్తున్నారు. దీంతో టీడీపీ ఎలాంటి హామీ ఇవ్వ‌లేదు. వైసీపీలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో చాన్నాళ్లుగా డీఎల్ విష‌యం రాజ‌కీయాల్లో న‌లుగుతోంది అయితే, ఇప్పుడు టికెట్‌పై హామీ ఇచ్చార‌ని అంటున్నారు. అయితే, అది మైదుకూరా?  లేక క‌డప ఎంపీ సీటా? అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి బాబు మాత్రం డీఎల్‌ను వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: