తెలంగాణలో ఇప్పుడు ఏ గల్లీలో చూసినా ప్రచారాల మోత మోగుతుంది.  గత నెల అసెంబ్లీ రద్దు చేసిన ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి నుంచి ఎన్నికల వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల అధినేతలు ప్రచారాలు చేస్తు ప్రజలను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు.  తాజాగా ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు లేవనెత్తిన ప్రశ్నకు తీవ్ర అసహనం ప్రదర్శించారు.

కేసీఆర్ ప్రసంగిస్తుండగా..ఓ యువకుడు లేచి 12 శాతం మైనారిటీ కోటా అమైందంటూ ప్రశ్నించాడు.  వెంటనే కేసీఆర్ అతడి వంక చూస్తూ.. "బాత్ కర్తే, బైఠో కామోష్ బైఠో. వోబీ బారాహ్ పర్సెంట్ హై బోలే కామోష్ బైఠో... బైఠ్ జావో అన్నారు. అయినా కూడా ఆ యువకులు ప్రశ్నించేందుకు ప్రయత్నించడంతో నేను చెబుతా, ఎందుకు తొందరపడుతున్నావు" అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఆ యువకుడు కూర్చోకపోవడంతో... "నోరు మూసుకో. చప్పుడు చేయకుండా కూర్చో. మాటలు నీ బాపుకు చెప్పాలా? ఎందుకు తమాషా చేస్తున్నావు?" అని గద్దించారు.  ఆ సమయలో కొంతమంది టీఆర్ఎస్ వాలింటీర్లు అతడి వైపు వెళ్లడం చూసి వద్దని వారించారు..ఇలాంటి వారు అక్కడక్కడా తగులుతుంటారని తన ప్రసంగాన్ని కొనసాగించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: