తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆచూకీపై వేసిన పిటిషన్ మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిగింది. రేవంత్ ఆచూకీ పైన వివరాలు ఇవ్వాలని వికారాబాద్ ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయనను అరెస్టు చేయలేదని, అదుపులోకి తీసుకున్నామని సీపీ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై నివేదిక కాపీనీ కోర్టుకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పది నిమిషాల పాటు విచారణను వాయిదా వేసింది. 
హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలోనే విడుదలనా?
కాగా, రేవంత్‌రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు ప్రశ్నకు రేవంత్‌రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని కోర్టుకు తెలిపిన పోలీసులు.  శాంతి భద్రతల దృష్ట్యా ఆయన్ను అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు, బంద్‌కు పిలుపునిస్తే తప్పేంటన్న కోర్ట్.   రేవంత్‌ను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్ని నియంత్రించారని పోలీసులను ప్రశ్నించిన కోర్టు.
Image result for రేవంత్ అరెస్ట్ హైకోర్టు
రేవంత్ అరెస్టుపై వేం నరేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. రేవంత్‌ను కనీసం పోలీసులు ఎక్కడ ఉంచారో తెలియదని, ఆయన ఎక్కడ ఉన్నా కోర్టులో హాజరుపరిచేలా చూడాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా,  ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే అదుపులోకి తీసుకున్నట్లు కోర్టుకు తెలిపిన పోలీసులు.  సాయంత్రం 4.30 కు రేవంత్ రెడ్డి ని విడుదల చేస్తామని కోర్టు కు తెలిపిన పోలీసులు. ఆధారాలు రేపు కోర్టుకు సమర్పిస్తామన్న పబ్లిక్ ప్రాసికూటర్ , పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.  రేవంత్ అరెస్టుకు కారణాలు ఆధారాలు ఈరోజే కోర్టుకు సమర్పించాలన్న కోర్టు అడ్వకేట్ జనరల్ ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించిన హై కోర్ట్. విచారణ 4 గంటలకు వాయిదా వేసిన కోర్టు. అరెస్టుపై ప్రభుత్వం మీద హైకోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో విడుదల చేశామని హైకోర్టుకు చెప్పేందుకు రిలీజ్ చేస్తుండవచ్చునని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: