ఎన్నికల వాతావరణం తెలంగాణాలో చలికాలంలో సెగలు రేపుతుంది. మొన్న సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ — సిపిఎస్  టీఆరెస్ ప్రభంజనం వీయబోతుందని చెప్పగా, అది టిఆరెస్ కుట్ర అని ప్రజాకూటమి ధారుణ విమర్శలు చేసిందిటివి-9 లైవ్ లోనే.  కాంగ్రెస్ నాయకుడు ఉత్తం కుమార్ రెడ్డి ప్రవర్తనకు ఖంగారు పడ్దారు. అత్యంత దయనీయకరంగా సెఫాలజిస్టు ముఖకవళికలు ద్వారా కనిపించాయి. 
Related image
ఈరోజు ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కాలం గాని కాలంలో విడుదల చేసిన సర్వే ప్రజా కూటమి ఫుల్-స్వీప్ చేయబోతుందని చెప్పింది. దీంతో తెలుగుదేశం పార్టీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలాగే దాన్ని విమర్శించటంతో టిఆరెస్ తక్కువేమీ తినలేదు.   
Image result for telangana rashtra samithi

తాజాగా మరో వైపు ఇండియా టుడే తాజా సర్వే మాత్రం టీఆర్‌ఎస్‌ పార్టే పైచేయి సాధిస్తుందని స్పష్టంచేసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్‌ జరగనుండటంతో ఈ సర్వేలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. లగడపాటి సర్వేకు భిన్నంగా ఇండియా టుడే తాజా సర్వేలో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యత లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. 
Image result for telangana rashtra samithi
ఇండియా టుడే పొలిటికల్‌ ఎక్స్‌ఛేంజ్‌ పిఎసీ, 17 పార్లమెంట్‌ నియోజవర్గాల్లో టెలిఫొనిక్‌ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో టీఆర్‌ఎస్‌కు గత నెల కన్నా  4 శాతం మద్దతు పెరిగినట్లు వెల్లడైందని ప్రకటించింది. గత నెలలో 44 శాతం మంది టీఆర్‌ఎస్‌కు మద్దతు నిలవగా, ప్రస్తుతం 48 శాతం మద్దుతు పలుకుతున్నట్లు తమ సర్వేలో స్పష్టమైందని పేర్కొంది. 
Image result for telangana rashtra samithi India today survey

ఇక ప్రభుత్వం మారాలనే వారి సంఖ్య కూడా 4శాతం పెరిగందని, గత నెలలో 34శాతం మంది ప్రభుత్వమార్పును కోరగా, ప్రస్తుతం ఆ మద్దతు 38 శాతంపెరిగిందన్నారు. ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్‌ బలంగా ఉండగా, దక్షిణ తెలంగాణలో కూటమికి అనుకూలంగా ఉందని తెలిపింది.
Image result for telangana rashtra samithi India today survey
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మీ లపై ప్రజల్లో ఆదరణ ఉందని, ఇది టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశమని పేర్కొంది. నగరంలో ఎంఐఎం మద్దతు కూడా కలిసిసొస్తుందని, మురికి వాడల్లో కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పని తీరుపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని తమ సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. ప్రతి పార్లమెంట్‌ నియోజక వర్గంలో టెలిఫొనిక్‌ ఇంటర్వ్యూ ద్వారా 6,887 శాంపుల్స్‌ తీసుకున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: