ఒక ప్రక్కన నాలుగు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతుండగా రాహుల్ గాంధి సారధ్యంలో కాంగ్రెస్ రథం నేఱాభియోగాలు ఋజువౌతుండగా స్కాముల ఊబిలో కూరుకుపోతుంది. ఒకటి అగస్థా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల స్కాంలో దళారిని దుబాయి ప్రభుత్వం భారత్ కు అప్పగించింది. మరొకటి నేషనల్ హెరాల్ద్ కేసు తల్లీ కొడుకులు సోనియా రాహుల్ గాంధిలు ఆదాయపన్ను కేసులో ఇరుక్కొన్నట్లే.

అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల స్కాంలో దళారీ క్రిస్టియన్ మైఖేల్‌ ను దుబాయ్ ప్రభుత్వం భారత్‌ కు అప్పగించిందని, ఈ స్కాంపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. మైఖేల్‌ ను సీబీఐ మన దేశానికి తెచ్చిందని, దీనిపై స్పందించాలని కాంగ్రెస్ ను ఆయన కోరారు. మైఖేల్‌ ను రక్షించాలని కాంగ్రెస్ కోరుకుంటోందా? అని ఆయన ప్రశ్నించారు. 
Christian Michel Sent to Five-Day CBI Custody - Sakshi
అగస్టా కుంభకోణం లో నిందితుడిగా ఉన్న మధ్యవర్తి, బ్రిటిషర్‌ క్రిస్టియన్‌ మైకేల్‌ ను ఢిల్లీ లోని ఒక కోర్టు ఐదు రోజుల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ - సీబీఐ కస్టడీకి అప్ప గించింది. భారత్‌లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రక్షణ మంత్రి సహా పలువురు వీవీఐపీల కోసం ₹3,600 కోట్లతో 12 విలాసవంతమైన హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మైకేల్‌ ను సీబీఐ అధికారులు నిన్న రాత్రి యూఏఈ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు.


అగస్టా కుంభకోణంలో లోతైన కుట్ర దాగుందనీ, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు జరపడానికి వీలుగా 14 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయవాది డీపీ సింగ్‌ కోరారు. దీంతో సీబీఐ ప్రత్యేక జడ్జి మైకేల్‌ను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించారు. అగస్టా ఒప్పందంలో భాగంగా మైకేల్‌ రూ.225 కోట్లు అందుకు న్నారనీ, ఈ మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలు, ఐఏఎఫ్‌ అధికారులకు లంచంగా చెల్లించారని సీబీఐ చార్జిషీటులో తెలిపింది.


మైకేల్‌ కంపెనీ గ్లోబల్‌ సర్వీసెస్‌ ద్వారా ఢిల్లీలోని ఓ మీడియా సంస్థలోకి నగదు వచ్చిన విషయాన్ని తాము గుర్తించినట్లు ఈడీ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారం పై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం ముదిరింది. మైకేల్‌ పై తప్పుడు వాంగ్మూలం ఇప్పించి ప్రతిపక్ష నేతలపై బురద చల్లేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అగస్టా కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న మైకేల్‌ను కాపాడాలనుకుంటోందా? అని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ప్రశ్నించారు.
Image result for augusta westland scam
స్కాంల్లో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ఈ విషయమై నోరుమెదపకుండా ఎందుకున్నారు? అని ఆయన ప్రశ్నించారు. నిన్న బుధవారం ఆయన విలేఖర్ల సమావేశం లో మాట్లాడుతూ, వీవీఐపీ హెలికాప్టర్ స్కాం ₹3600 కోట్లని, ఈ కేసులో ఏజన్సీ చురుకుగా వ్యవహరించినందువల్ల దుబాయ్ నుంచి మైఖేల్‌ ను తీసుకురాగలిగామని అన్నారు.


నవజోత్ సిద్దూ ర్యాలీ లో పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారన్న అభియోగంపై మాట్లాడుతూ ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని బయటపెట్టాలన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల పైనే సిద్దూ పాకిస్తాన్‌కు వెళ్లారా? లేదా? అనే విషయమై కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలన్నారు.
Image result for augusta westland scam
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ బాజ్వాను సిద్దూ ఆలింగనం చేసుకోవడంపై కూడా తన వైఖరిని కాంగ్రెస్ పార్టీ బహిర్గతం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశంలో ప్రతికూల రాజకీయాలకు పాల్పడు తోందన్నారు. దేశంలో కులతత్వాన్ని, మైనార్టీలను బుజ్జగించే ధోరణులకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతోందన్నారు. తెలంగాణాలో రాజస్థాన్ లలో ముఖ్యమంత్రి ఎవరో ఖరారు చేసే స్థితిలో కాంగ్రెస్ లేదన్నారు. 


కాంగ్రెస్ పార్టీకి విధానాలు, నాయకత్వం, దిశ, దశ లేదన్నారు. ప్రాంతాల వారీగా కులాలను రెచ్చగొట్టి పబ్బం గడుపు కోవడం కాంగ్రెస్ కు అలవాటైందన్నారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను అనుసరిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారి సంఖ్య పెరిగిందన్నారు. రాజస్తాన్‌లో బీజేపీ 15 రోడ్‌షోలను, 222 ఎన్నికల ర్యాలీని నిర్వహించింది.

Image result for augusta westland scam

మరింత సమాచారం తెలుసుకోండి: