సినీతారలు తమ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకొని, నటన నుంచి నిష్క్రమించాక రాజకీయాల వైపు నడక కొనసాగించటం సహజం. ఈ మార్గం లో హేమమాలిని, రేఖ, జయాబాదురి, జయప్రధ, నగ్మా, కుష్బూ, రమ్య లాంటి  ఎందరో తారలు రాజకీయ అరంగేట్రం చేశారు. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అయ్యారు. మంత్రి పదవులేకాదు దివంగత జయలలిత ఏకంగా దశాబ్ధాలపాటు ముఖ్యమంత్రిగా తమిళనాడును ఏలేశారు. 
Image result for madhuri dixit and amit shah
ఒకప్పటి బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్ ఇప్పుడు ఇదే వార్తల్లో వ్యక్తి అయ్యారు.  ఆమె ఇదే జాబితాలో చేరిపోవటం నిశ్చయమైనట్లు సమాచారం. ఆమె కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పుణె నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె పేరును దాదాపుగా భాజపా ఖరారు చేసినట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో పుణె నియోజక వర్గంలో భాజపా అభ్యర్థి అనిల్ శిరోల్ విజేతగా నిలిచాడు. అంతకుముందు అది కాంగ్రెస్ సీట్. భాజపా అభ్యర్థి మూడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించడం విశేషం. అనిల్ శిరోల్ స్థానం లోకి ఇప్పుడు మాధురిని తెస్తుండటం విశేషమే. కొన్ని నెలల కిందటే భాజపా అధ్యక్షుడు అమిత్ షా మాధురి ఇంటికి వెళ్లి ఆమెను భారతీయ జనతా పార్టీలోకి తీసుకురావడంపై చర్చించినట్లు సమాచారం. మాధురి దీక్షిత్ కూడా పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేశారట.

Image result for madhuri dixit and amit shah

సరైన అభ్యర్ధుల కీలక స్థానాలకు ఎంపిక ప్రక్రియను బిజెపి చాలాకాలం నుండే ప్రారంభించింది.  ఎన్నికల కోసం చాలా ముందు నుంచే సన్నాహాల్లో ఉన్న భాజపా నాయకత్వం ఇప్పటికే చాలా స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మాధురి దీక్షిత్ ని పుణెకు ఖరారు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి మాధురి ఆకర్షణ రాబోయే ఎన్నికల్లో ఏమేరకు పని చేస్తుందో చూడాలి.

Related image
ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నేపథ్యంలో, బీజేపీ వచ్చే ఏడాది ప్రధమార్ధంలో జరగనున్న సాధరణ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో పూణె నియోజక వర్గం నుంచి ప్రముఖ బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ను బరిలోకి దించుతున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల కోసం ఎవరెవరిని బరిలోకి దించాలనే అంశంపై బీజేపీ ఇప్పటికే జాబితాను పూర్తి చేసినట్లు పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు తెలిపారు. ఈ జాబితాలో మాధురికి, పూణె నుంచి టికెట్‌ నిశ్చయించారు. 
Image result for madhuri hum aapke hain koun images
ఈ ఏడాది జూన్‌ లో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ముంబయిలోని మాధురి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. సంపర్క్ పర్ సమర్ధాన్  - భాజపాకు మద్దతివ్వండి అనే కార్యక్రమంలో భాగంగా అమిత్‌ షా ఆమెతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి, సాధించిన అభివృద్ధి గురించి అమిత్‌ షా మాధురికి వివరించారు.

ఈ విషయం గురించి బీజేపీ సీనియర్‌ నాయకుడు ఒకరు, నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యూహాలనే పాటించారు. ఆ సమయంలో పాత అభ్యర్థుల స్థానంలో కొత్త వారిని నిలబెట్టి భారీ మెజారిటీ సాధించి ప్రతిపక్షాలకు షాక్‌ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది’ అంటూ చెప్పుకొ​చ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: