మన ఎన్నికల సంఘం ఓటువెయ్యటం గురించి విపరీతంగా దంచేస్తుంది. అది పౌరులహక్కని పదేపదే వాయించేస్తుంది. పౌరులు ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం ఉండేలా చేయాలి. ఏర్పాట్లు అంటే పోలింగ్ బూత్, అక్కడ అధికారులు, వోటింగ్ మిషీన్స్ ఉండటం మాత్రమే కాదు వోటర్ కార్డ్ ఉన్నవాళ్ళకి ఓటువెసే పరిస్థితులు. లిస్ట్ లో వారి పేర్లు ఉండేలా చూడటం అని కూడా!  తగిన ఏర్పాట్లు చేయవలసిన అధికారులు బాధ్యత తీసుకోవటం లేదు. అంటే వోటర్ కార్డు ఉన్న వారి పేరు వోటర్ లిష్ట్ లో లేకపోతే ఒక అధికారి దానికి బాధ్యత వహించే ఏర్పాట్లు ఉండాలి.

Image result for chiranjeevi nagarjuna in que in polling booth

సామాన్యునిలా క్యూలో నిల్చున్న అనన్యసామాన్యుడు 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా అనేక సమస్యలు చోటు చేసు కుంటున్నాయి. ప‌లువురు ప్ర‌ముఖుల‌కు చిత్ర‌ విచిత్రమైన అనుభ‌వాలు ఎదుర‌వు తున్నాయి. పోలింగ్ కేంద్రంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావుకి చేదు అనుభవం ఎదురైంది. ఓటర్ల నుంచి ఆయనకు అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో ఓటు వేయకుండానే ఆయన వెనక్కి వెళ్లిపోయారు.

Image result for k raghavendra rao

అనన్యసామాన్యునిలా ఫీలై క్యూలో నిల్చోకుండా సామాన్యునిలా అలకవహించిన టిటిడి పాలకవర్గ సభ్యుడు 

Image result for k raghavendra rao

ఓటు వేసేందుకు రాఘవేంద్రరావు ఫిలింనగర్ క్లబ్‌లోని పోలింగ్ బూత్‌కు వచ్చారు. అయితే క్యూలైన్‌లో నిలబడకుండా ఓటు వేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. దీంతో క్యూలో ఉన్న వారు అభ్యంతరం తెలిపారు. దీంతో చిన్న బుచ్చుకున్న రాఘవేంద్రరావు ఓటు వేయంకుండానే వెనక్కి వెళ్లిపోయారు. సామ్యానులకైనా, సెలబ్రిటీల కైనా రూల్స్ వర్తిస్తాయని క్యూలో ఉన్నవారు చెబుతున్నారు. నాగార్జున, అల్లు అర్జున్, చిరంజీవి, జూ.ఎన్టీఆర్ లాంటి సెలబ్రిటీలు మాత్రం క్యూలైన్‌ ఉండి రూల్స్‌ ఫాలో అయ్యారు. క్యూలైన్‌ లో నిలబడి ఓటు హక్కు ను పద్దతిగా వినియోగించుకున్నారు.

Image result for gutta jwala  K raghavendra rao

కాగా, పోలింగ్ సమయంలో కొంతమంది ఓట్లు గల్లంతు కావటం సర్వసాధారణం. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఈ బారిన ప‌డ్డారు. పేరు ఓటర్ల జాబితాలో గల్లంతైంది. ఉదయం బంజారాహిల్స్ లోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన గుత్తా జ్వాల పేరు ఓటర్ల జాబితాలో లేదని ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో ఆమె అసంతృప్తి తో  వెనుదిరిగారు. గత ఎన్నికల్లో తాను ఇక్కడే ఓటు వేశానని, ఇప్పుడు ఎందుకు లేదనీ, ఎందుకు తన పేరును ఓటర్ల లిస్ట్ నుండి తొలగించారో తెలియదని ఆమె వాపోయారు.

Image result for chiranjeevi nagarjuna in que in polling booth

సామాన్యునిలా క్యూలో నిల్చున్న అనన్యసామాన్యుడు చిరంజీవి 

నా ఓటు పోయింది. ఆన్‌లైన్‌ ఓటరు జాబితాలో నా ఓటు లేకపోవడంతో ఆశ్చర్యపోయాను అని ట్వీట్‌ చేశారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లతో నిరసన తెలిపారు.  గత ఎన్నికల్లో తాను ఇక్కడే ఓటు వేశానని, ఇప్పుడు ఎందుకు లేదో, ఏ కారణంతో తన పేరును తొలగించారో తెలియ దంటూ ఆవేదన చెందారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరిగినట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Image result for no names in voter list in telangana

అనేక మంది వారి పేర్లు కూడా గల్లంతయ్యాయి అని ట్వీట్‌ చేస్తూ ఆమెకు మద్దతుగా కూడా నిలుస్తున్నారు. ఓటర్ కార్డు ఉండి ఓటర్ల లిస్టు లో పేరు లేక పోవటం అధికారుల బాధ్యతారాహిత్యానికి పెద్ద ఉదాహరణ. అలాగే వోటర్ కార్డు ఉండి ఓటర్ లిస్టులో పేరుండి ఓటు వెయ్యని నేరానికి కూడా కారణం చూపించని పక్షంలో ఓటర్ను కూడా ప్రశ్నించే వ్యవస్థ ఉండాలి.

Image result for chiranjeevi nagarjuna in que in polling booth

క్లైమాక్స్


టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ఎట్టకేలకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేడు ఉదయం ఆయన పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి అసంతృప్తితో వెనుతిరిగిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఫిల్మ్ నగర్ బూత్ వద్ద లైన్ పెద్దగా ఉండడంతో ఆయన మొదట క్యూని పట్టించుకోలేదు.  ఉదయం డైరెక్ట్ గా ఓటు వేయడానికి లోపలి వెళుతుండడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేయగా రాఘవేంద్రరావు వెనుదిరిగి వెళ్లారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆయన క్యూలోనే వెళ్లి వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు సినిమా ప్రముఖులందరూ సాధారణ జనాలతో కలిసి లైన్ లో వచ్చి ఓటువేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: