భారత దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు అవుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే మద్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ లో ఎన్నికలు జరిగాయి.  నేడు తెలంగాణ, రాజస్థాన్ లో పోలింగ్ జరుగుతుంది.  తెలంగాణలో దాదాపు ప్రశాంతంగానే ఓటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రాజస్థాన్ లో చెదురుమదురు సంఘటనలు జరిగినట్లు సమాచారం. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడటం తెలిసిందే.  సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఓటింగ్ వేసే సమయంలో కాస్త సడలింపు ఉంటుంది.
Image result for rajasthan polling
కానీ రాజస్థాన్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఆయన స్వగ్రామంలో ఉదయం 8 గంటలకల్లా బికనీర్ జిల్లాలోని 172వ పోలింగ్ బూత్‌కు  కానీ అప్పటికే అక్కడ పెద్ద క్యూ ఉండటం..అదే సమయంలో సాంకేతిక సమస్య కారణంగా ఈవీఎం కొంత సమయం పనిచేయలేదు.
Image result for rajasthan polling
దీంతో తన వంతు వచ్చే వరకు ఆయన క్యూలో నిలుచునే ఉన్నారు.  మేఘవాల్‌కు 11.30కు ఓటు వేసేందుకు అవకాశం కలిగింది. అర్జున్ రామ్ ఓటు వేసిన పాఠశాలలోనే ఆయన చదువుకున్నారు..అంతే కాదు ఈ రోజు ఆయన పుట్టిన రోజు కావడం మరో విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: