• తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న ఘర్షణలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సజావుగా సాగింది. పోలింగ్ శాతం దాదాపు 70 శాతంగా నమోదైంది. ఉదయం నుంచే అనేక మంది ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం కొన్ని చోట్ల ఈవీఎంలు పలుచోట్ల మొరాయించాయి. వాటిని అధికారులు పరిష్కరించారు.


  • గవర్నర్ నరసింహన సహా పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేటీఆర్ హిమాయత్ నగర్లో ఓటేశారు. ఎంపీ కవిత నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఓటేశారు. తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ తార్నాకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీలో ఓటేశారు.


  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ఎన్నికల అధికారులపై దాడులకు ప్లాన్ చేసిన మావోయిస్టు యాక్షన్ టీమ్ ను పోలీసులు పట్టుకున్నారు

  • 13 సమస్యాత్మక నియోజకవర్గాల‌్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.


  • పలు చోట్ల టీఆర్ఎస్ , బీజేపీ అక్రమాలకు పాల్పడ్డాయని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

  • ఆలేరు బరిలో దిగిన బీఎల్ ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నరసింహులుకు గుండెపోటు వచ్చింది. ఆయన్ను ఆసుపత్రికి తరలించాయి. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.


  • కల్వకుర్తిలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ వారే తమపై దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ వారే దాడి చేశారని బీజేపీ వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు.


  • రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రక్తతల దృష్ఠ్యా పోలీసులను భారీగా మోహరించారు. కోస్గిలోని నాగుల పల్లిలో టీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య దాడులు జరిగాయి.


  • హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్ పురాలో ఎం ఐ ఎం - ఎంబీటీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.


  • ఖమ్మం జిల్లా రావినూతలలో టీఆర్ఎస్ - బీఎల్‌ఎఫ్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు.


  • హైదరాబాద్ లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ దర్శకుడు రాజమౌళి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


  • ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలింగ్ స్టేషన్ వద్దే మరణించారు. వరంగల్ జిల్లా పైడిపల్లిలో ఒకరు.. నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో ఒకరు గుండెపోటుతో మృతి చెందారు.

  • ఈసారి కూడా ప్రముఖుల ఓట్లు గల్లంతయ్యాయి. మంత్రి ఈటల రాజేందర్ తండ్రి, మరో ఇధ్దరి కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతయ్యాయి. హైదరాబాద్ లో ఓటేసేందుకు వెళ్లి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు చేదు అనుభవం ఎదురైంది. ఆన్ లైన్ లో ఆమెకు ఓటు ఉన్నట్టు చూపిస్తున్నా.. పోలింగ్ బూత్ వద్దకు వెళ్లేసరికి ఆమె ఓటు లేదు. ఓటేద్దామని వెళ్లిన ఆమె ఓటు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.


  • సికింద్రాబాద్ లో, పటాన్ చెరులో, వనపర్తిలో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని.. ఓటర్లు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

  • ఖమ్మం జిల్లా ఏన్కూరులో గ్రామ సమస్యలు పరిష్కరించడం లేదంటూ గ్రామస్తులు ఓటింగ్ ను బహిష్కరించారు.


  • ఓటేసేందుకు రాజధాని నుంచి గ్రామాలకు వెళ్తుండటం వల్ల టోల్ ప్లాజాల్లో ఫీజు వసూలు చేయవద్దని ఈసీ ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: