అంబానీలు అంటే తెలియని వారు ఉండరు. దేశంలోనే అత్యధిక సంపన్న కుటుంబం. అలాంటి అంబానీల కుటుంబంలో పెళ్లంటే మాటలా.. విందులు, వినోదాల కోసం కోట్లలోనే ఖర్చవుతుంది. కానీ అంబానీల విందుల్లో విలాసాలతో పాటు సామాజిక కోణమూ ఉండటం విశేషం.



ముకేశ్ అంబానీ కూతురు ఈశా అంబానీ, ఆనంద్ పిరమాల్ వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలను ఉదయ్ పూర్ లో ప్రారంభించారు. ప్రారంభమయ్యాయి కూడా. అందులో భాగంగా భారీ ఎత్తున అన్నదానం చేస్తున్నారు. నాలుగు రోజులపాటు.. ప్రతిరోజూ మూడు పూటలా ఈ అన్నదానం ఉంటుంది.


మొత్తం 5 వేల మందికి పైగా అన్నదానం చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వికలాంగులే కావడం విశేషం. అన్నదానం అంటే ఏదో డబ్బు ఇచ్చేశాం అని కాకుండా అంబానీ కుటుంబ సభ్యులు దగ్గర ఉండి మరీ స్వయంగా వికలాంగులకు కొసరి కొసరి వడ్డించారు. ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ.. వారి కుమారుడు అనంత్ కూడా అందరికీ దగ్గరుండి వడ్డించారు. వికలాంగులు పూర్తిగా భోంచేసేంత వరకూ ఉండి.. వారితో మాట్లాడుతూ గడిపారు.


అన్నదానం తర్వాత కూడా వికలాంగులతో అంబానీ కుటుంబ సభ్యులు ఆడిపాడారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లక్షలు కోట్లు పెట్టి ఆడంబరం గా వివాహాలు, విందులు చేసుకునే వారు.. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు కూడా చేపడితే బావుంటుంది కదా. మరి అంబానీలను చూసి మిగిలిన వారు కూడా వారిని ఫాలో అయితే సమాజంలోని కొన్ని వర్గాలు ఆ ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం తినగలుగుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: