జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక పటిష్ఠమైన రాజకీయవేదికను ఏర్పాటుచేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నారట.  25 ఎంపిలకు కూడా ప్రాతినిద్యంలేని టిడిపి అధినేత దేశంలోని ప్రతిపక్షాలకు కీలకం ఎలా అవుతారు?  కనీసం 5% శాతం కూడా సభ్యులు లేని టిడిపి అధికారపక్షం బిజెపితో అమీతుమీకి ఎలా విపక్షాలను సిద్ధంచేస్తుంది.


ఈరోజు మధ్యహ్నం 3:30 గంటలకు ఢిల్లీ లోని కానిస్టిట్యూషన్-క్లబ్‌ లో ప్రతిపక్షాల సమావేశం ప్రారంభంకానుంది. రేపు పార్లమెంట్ సమావేశాలకై భవిష్యత్తు కార్యాచరణ ఖరారుపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పలువురు ముఖ్యమంత్రులను చంద్రబాబు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆహ్వానించారని అంటున్నారని తెలుగు మీడియా రాస్తుంది, చూపుతుంది. 

Image result for unity of opposition to BJP & MOdi meeting today in Delhi constitution club

ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు అందులో చంద్రబాబు ఒక్కరు. అదీ ఆయన కొత్తగా విపక్షంలో చేరిన నాయకుడు. బిజెపి యేతర పక్షాల సమావేశానికి హాజరు అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు.


బీజేపీయేతర పక్షాలన్నింటితో దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం ఉదయం ఒక భారీ భేటీ నిర్వహిస్తున్నారు. బీజేపీ మినహా ఇతర పార్టీల నేతలందరినీ దీనికి ఆహ్వానించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామిలను, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి ఆహ్వానించారని ఇక్కడి మీడియా రాస్తుంది డప్పు డబ్బా టముకు తాళం ఏది దొరికితే దాన్ని పట్టుకొని వాయించేస్తుంది.

Image result for unity of opposition to BJP & MOdi meeting today in Delhi constitution club

అలాగే జాతీయ స్థాయి సీనియర్ నాయకులైన ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్, మాయావతి, ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, ఇంకా శరద్‌యాదవ్‌ను కూడా చంద్రబాబు ఆహ్వానించారని, మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కూడా మరికొంతమంది నాయకులు ఈ భేటీకి హాజరు కానున్నారు. సేవ్ డెమొక్రసీ, సేవ్ నేషన్ పేరుతో బీజేపీయేతర పక్షాలు ఏకమవుతున్నాయి.

Image result for chandrababu chakram baabu

దేశవ్యాప్తంగా ర్యాలీలు, సభల నిర్వహణ, భవిష్యత్ కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియ వచ్చింది. ఇప్పటికే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలావరకు ప్రతిపక్షాలను ఏకతాటి మీదకు తీసుకొచ్చి, ప్రజాకూటమిగా ఏర్పాటు చేసిన చంద్రబాబు, అక్కడి అధికార పార్టీకి దీటుగా పోటీ ఇవ్వ గలిగారని ఏపి ప్రధాన మీడియా చెపుతుంది. 

Image result for unity of opposition to BJP & MOdi meeting today in Delhi constitution club

ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరోవైపు అధికార టీఆర్‌ఎస్ నాయకులు కూడా తమ ప్రభుత్వమే అధికారం లోకి వస్తుందని చెబుతున్నారు. పైకి ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నా అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా ప్రజాకూటమి కూడా బరిలో నిలవడం ఈసారి తెలంగాణ ఎన్నికల విశేషం.

Image result for chandrababu chakram baabu

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లాంటివాళ్లు నిర్వహించిన సర్వేలలో కూడా కాంగ్రెస్-టీడీపీల నేతృత్వం లోని ప్రజాకూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఒకప్పుడు తెలుగుదేశంపార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకం అవుతుందనుకున్న తెలంగాణలో చంద్రబాబు అడుగు పెట్టడమే కాక, అధికార పార్టీకి కూడా చెమటలు పట్టించగలిగేలా ఉధృతంగా ప్రచారం చేశారు. తాను తిరగడంతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కూడా కలిసి ప్రచార సభల్లో పాల్గొన్నారు.

Image result for unity of opposition to BJP & MOdi meeting today in Delhi constitution club

తెలుగుదేశం పార్టీ స్వయంగా పోటీ చేసే నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోడానికి ఏపీ నుంచి కీలకమైన ఎమ్మెల్యేలు, మంత్రులను తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థులకు అండగా ఉంచారు. ఇలా చాలా వరకు తెలంగాణలో తన ఉనికిని చాటుకున్న చంద్రబాబు ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీతో ఢీ కొనేందుకు సిద్ధమవుతున్నారు.


దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించాల్సిందేనని, ఎవరికి వారు విడి విడిగా పోటీ చేసి ఓడిపోవడం కంటే అంతా కలిసి ఒక్క తాటి మీద నిలిచి గెలవాలని ఆయన పిలుపు నిస్తున్నారు. ప్రధానంగా మమతా బెనర్జీ లాంటి సీనియర్ నాయకులను కూడా ఈ వేదిక మీదకు తీసుకురావడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారు.

Image result for unity of opposition to BJP & MOdi meeting today in Delhi constitution club

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు రావచ్చని ఎగ్జిట్-పోల్స్ అంచనాలు చెబుతున్న నేపథ్యంలో భవిష్యత్తు వ్యూహాల గురించి నాయకులు చర్చించే అవకాశం ఉంది.  దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగే బీజేపీ యేతర పక్షాల సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్ తెలిపారు. కూటమి విషయం లో కాంగ్రెస్ వైపు నుంచి గానీ, ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నుంచి గానీ ఎలాంటి ముందడుగు లేదని, మూడు రాష్ట్రాల ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండానే పోటీ చేశామని ఆయన అన్నారు.


ముందుగా రెండు పక్షాల మధ్య చర్చలు జరగాలని, నిజంగా ఇద్దరం కలవడానికి కుదురుతుందో? లేదో? చూసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ వైపు నుంచి చొరవ లేదు కాబట్టి, తామూ ముందుకు వెళ్లే ప్రసక్తి  లేదని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 80-100 స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని సంజయ్‌ సింగ్ తెలిపారు. ప్రధానంగా ఢిల్లీ, హరియాణా, పంజాబ్, గోవాలలో అన్ని స్థానాలతో పాటు ఇతర రాష్ట్రాలలో ఇంకొన్ని చోట్ల పోటీ చేస్తామన్నారు. 

Image result for unity of opposition to BJP & MOdi meeting today in Delhi constitution club

చక్రం తిప్పటం నారా చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. అసలు ఇక్కడ చక్రమే లేదు. దానిని తిప్పవలసిన అవసరమూ లేదు కారణం జాతీయ స్థాయిలో పద్నాలుగు ప్రాంతీయపార్టీలు అన్నీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేఖమైనవే. సిద్దాంతాల పరంగా గాని, రాగ్ధాంతాల పరంగా కాని ఇవి కేంద్రంతో విభిన్నం.

Image result for chandrababu naidu meets rahul gandhi

చంద్రబాబు తిప్పిన చక్రం రాహుల్ గాంధి 


11 డిసెంబర్ న పార్లమెంట్ సమావేశం జరగనున్న దరిమిలా అన్నీ ప్రతిపక్షాలు ఒక రోజు ముందు సమావేశం జరపటం ఒక సాంప్రదాయమే. అయితే దీనికి చంద్రబాబు సమన్వయ కర్త అని పనిగట్టుకొని ప్రచారం చేయటం తెలుగు మీడియా ధౌర్భాగ్యం మాత్రమే. విపక్షాలు అవి తొలి నుండీ విపక్షాలే. కొత్తగా అవి విపక్షాలు కావటం లేదు. ఏదైనా కొత్త సంఘటన ఉందంటే చంద్రబాబు బిజేపి నాయకత్వంలో ఎన్ డి ఏ నుండి బయటపడి విపక్షంగా మారటం మాత్రమే. అంటే విపక్షంలో ఆయన చేరే సన్నివేశం ఆయనకు కీలకం కావచ్చు. ప్రతిపక్షాల ఐఖ్యతకు ఏమాత్రం చంద్రబాబు కీలకం కాదన్నది ఏపి జానాభిప్రాయం. 

Image result for aspirants of PM post in Opposition of India

ఇక పోతే మమత బెనర్జీ లాంటి వారిలో కూడా నిన్నటి వరకు బిజెపి నాయకత్వంలో అంటకాగిన టిడిపి, నేడు బయటపడటంలోని స్వార్ధం అర్ధం చేసుకున్నారు. ఇతర విపక్ష నాయకులు మాయావతి, అరవింద్ కెజ్రివాల్ పినరయి విజయన్, స్టాలిన్, శరద్ పవార్, మూలాయం శరద్ యాదవ్ లాంటి వారు ప్రతిపక్షాల ఐఖ్యత గుఱించి మాట్లాడుతున్నారు కాని  ఈ చక్రం తిప్పటం, కీలకం, కీలక పాత్ర గుఱించి ఎక్కడా మాట్లాడటం లేదు. చంద్రబాబు కూడా నలుగురితో నారాయణే - ఏ మాత్రం ప్రత్యేకత లేదని జాతీయ మీడియా విశ్లేషణ. 


అసలు వారు  చంద్రబాబును నమ్మతగిన వ్యక్తిగా చూడటం లేదు. ఈ విషయంలో జాతీయ మీడియా చాలా స్పష్టంగా ఉండగా - ఆ నిజాన్ని మన ప్రాంతీయ ప్రభుత్వ మీడియా కప్పి పెడుతూ చంద్రబాబు ఏప్పటిలా చక్రం బాబు అయ్యారని చెప్పటమే సిగ్గు చేటని కొందరు విపక్షాలలోని సీనియర్ నాయకులు బల్ల గుద్ది చెపుతున్నారు.


Image result for aspirants of PM post in Opposition of India

మరింత సమాచారం తెలుసుకోండి: