ముంద‌స్తు ముచ్చ‌ట ముగిసిన తెలంగాణాలో మ‌రో 24 గంట‌ల్లో ఎవ‌రు రాజో..  ఎవ‌రు రెడ్డో తేలిపోతుంది! దీంతో ఇటు ఏపీలోను, అటు తెలంగాణాలోనూ కూడా తీవ్ర ఉత్కంఠ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మాకే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతున్నార‌ని.. అటు టీఆర్ ఎస్ కాదు మాకే జై కొడుతున్నార‌ని మ‌హాకూట‌మి రెండు శిబిరాల్లోనూ ధీమా క‌నిపిస్తోంది. అయితే, అటు ఇటు కాకుండా మ‌ధ్య‌స్థంగా ప్ర‌జా తీర్పు హంగ్ అయితే,.. ఏం చేయాలి? ఎవ‌రు అదికారంలోకి వ‌స్తారు? అనేది ఇప్పుడు ప్ర‌ధానంగా తెర‌మీదికి వ‌చ్చిన చ‌ర్చ‌. ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ప‌లు జాతీయ స‌ర్వేలు వెల్ల‌డించిన స‌మాచారం మేర‌కు టీఆర్ ఎస్‌కు అధికారం ద‌క్కుతుంద‌ని చెప్పినా.. బొటాబొటీ మార్కులేన‌ని అంటున్నారు. 


ఇక‌, రాజ‌గోపాల్ స‌ర్వే ప్ర‌కారం.. కూట‌మిదే పైచేయి అని తేలిపోయింది. అయితే, ఏ స‌మాచారం న‌మ్మాలో కూడా ఇప్పుడు ఎవ‌రికీ అర్ధం కాలేదు. ఎన్నిక‌ల స‌ర‌ళి.. పోలింగ్ ప‌ర్సంటేజ్ ఆధారంగా చూస్తే.. హంగ్ వ‌చ్చే ఛాన్స్‌ను కొట్టిపారేయ‌లేమ‌న అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో అటుకేసీఆర్ కానీ ఇటు మ‌హాకూట‌మి కానీ, ఒక వేళ హంగ్ వ‌చ్చినా.. ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు దూకుతున్నాయి. ఈ క్ర‌మంలో వారికి క‌లిసి వ‌స్తున్న అభ్య‌ర్థుల విష‌యాన్ని చూస్తే.. చాలా చిత్రంగా ఉంది. హంగ్ క‌నుక వ‌స్తే.. కేసీఆర్‌కు మ‌ద్ద‌తిస్తామ‌ని ఇప్ప‌టికే మ‌జ్లిస్ పార్టీ చెప్పుకొచ్చింది. తాము క‌నీసం 7 స్థానాల్లో విజ‌యం సాధిస్తామ‌ని, ఈ ఎమ్మెల్యేల‌ను కేసీఆర్‌కు మ‌ద్ద‌తిస్తామ‌ని ఆ పార్టీ నాయ‌కుడు అస‌దుద్దీన్ చెప్పారు. 


అదేస‌మ‌యంలో తెలంగాణా బీజేపీ కూడా ఇదే వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించింది. కేసీఆర్‌కు మ‌ద్ద‌తిచ్చే విష‌యాన్ని ప‌రిశీలిస్తామ ని చెప్పింది. ఈ పార్టీకి కూడా న‌లుగురు నుంచి ఆరుగురు వ‌ర‌కు ఎమ్మెల్యేలు గెలుస్తార‌నే న‌మ్మ‌కంగా ఉంది.ఒక‌వేళ హంగ్ వ‌స్తే.. మ‌హాకూట‌మికి ఈ పార్టీ ఎలాగూ మ‌ద్ద‌తివ్వ‌దు.. సో.. మిగిలింది కేసీఆర్. దీంతో బీజేపీ నాయ‌కుడు ల‌క్ష్మ‌ణ్ ఇప్ప‌టికే కేసీఆర్‌తో చ‌ట్‌లో ఉన్నారు. మ‌హాకూట‌మి విష‌యానికి వ‌స్తే.. వీరికి ఆశ‌లు క‌ల్పిస్తోంది. మ‌జ్లిస్‌, ఇండిపెండెంట్లు.

ల‌గ‌డ‌పాటి అంచ‌నాల ప్ర‌కారం ఇండిపెండెంట్లు.. ఐదుగురు గెలిస్తే.. వీరు ఎవ‌రికి మ‌ద్ద‌తిచ్చే విష‌యం ఇంకా చ‌ర్చ‌కు రాలేదు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారే కావ‌డంతో తిరిగి ఆపార్టీకి మ‌ద్ద‌తిస్తారా?  లేక కేసీఆర్‌కు జై కొడ‌తారా? అనేది తేలాల్సి ఉంది. మ‌జ్లిస్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో మెజారిటీ ఎలా ఉన్నా.. హంగ్ వ‌స్తే కూడా తానే కింగ్ అవుతాన‌ని చ‌క్రం తిప్పుతాన‌నే అంటున్నారు కేసీఆర్‌. మ‌రి ఏం జ‌రుగుతుందో తెలియాలంటే.. 24 గంట‌లు గ‌డ‌వాల్సిందే!! 


మరింత సమాచారం తెలుసుకోండి: