లగడపాటి రాజగోపాల్.. సర్వేల విషయంలో దిట్టగా పేరున్న ఈ రాజకీయ నేత లెక్క మొట్టమొదటిసారి ఘోరంగా తప్పింది. ఆయన చెప్పిన ఫలితాల లెక్కలు దారుణంగా తప్పాయి. తెలంగాణలో మహా కూటమి 65 సీట్లు పైగా గెలుచుకుంటుందని ఆయన చెప్పినా ఆ లెక్క 20 కూడా దాటలేదు.

టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తోందని.. ఆ పార్టీకి 35 కంటే సీట్లు వచ్చే అవకాశం లేదని లగడపాటి తన సర్వేలో చెప్పారు. కానీ ఎవరూ ఊహించని విధంగా 85కు పైగా సీట్లు సాధించి వరుసగా రెండోసారి అధికారం అందుకోబోతోంది. కేసీఆర్ 100కు పైగా సీట్లు సాధిస్తామని చెప్పినా.. చివరకు ఆ సంఖ్యను అందుకోలేకపోయారు.

అలాగే ఇండిపెండెంట్లు పది మంది వరకూ గెలుస్తారని చెప్పిన లగడపాటి మాట నిజం కాలేదు. బీజేపీ కూడా అనూహ్యంగా 7 వరకూ సీట్లు గెలుస్తుందని చెప్పినా ఆ లెక్క కూడా తప్పింది. ఓవరాల్ గా లగడపాటి సర్వే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆయన విశ్వసనీయతను దెబ్బ తీసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: