తెలంగాణలో టీఆర్ఎస్ నేత హరీశ్ రావు సరికొత్త రికార్డు సృష్టించారు. లక్ష కు పైగా మెజారిటీ సాధించి తనకు సిద్ధిపేటలో తిరుగులేదని మరోసారి నిరూపించారు. పోలింగ్ రోజు ఎదురెదురు పడిన కేటీఆర్, హరీశ్ రావు కలుసుకున్న సమయంలోనూ సిద్దిపేటలో మెజారిటీ గురించి చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలోనే బావా.. నీకు లక్ష మెజారిటీ రావాలని మంత్రి కేటీఆర్.. హరీశ్ రావు ను కోరారు. బావమరిది కోరికను బావ హరీశ్ తీర్చేశారు. అంతే కాదు.. నీ మెజారిటీలో సగమైనా తెచ్చుకుంటా అంటూ అని కేటీఆర్ అన్న సంగతి తెలిసిందేఅన్నట్టుగానే హరీశ్ వరుసగా ఆరోసారి ఇక్కడ గెలిచి సత్తా చాటారు.

సిద్దిపేటలో హరీశ్ కు తిరుగులేదన్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఇది కేసీఆర్ నియోజకవర్గం. కేసీఆర్ ఇక్కడ అనేక సార్లు వరుసగా గెలుపొందారు. కేసీఆర్ గజ్వేల్ కు మారిన తర్వాత ఇక్కడ హరీశ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఇక్కడ హరీశ్ రావు 60 వేలకు పైగా మెజారిటీ సాధించారు. గత ఎన్నికల్లోనూ హరీశ్ దే అత్యధిక మెజారిటీ.

ఈసారి సిద్దిపేటలో పోటీ మరింత బలహీనంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నా పోటీ ఓ మాదిరిగా ఉండేది. కానీ ఈసీటును పొత్తులో భాగంగా తెలంగాణ జనసమితికి కేటాయించారు. ఆ పార్టీ తరపున బరిలో దిగిన భవానీరెడ్డి హరీశ్ కు కనీస పోటీ ఇవ్వలేకపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: