తెలంగాణ ఎన్నికల్లో కారు దూసుకుపోయింది. కేసీఆర్ సర్‌కారుకే జనం జై కొట్టారు. 119 సీట్లకు 88 సీట్లు గెలుచుకుంది. అంతా బాగానే ఉంది. కానీ ఓ రెండు నియోజకవర్గాల్లో మాత్రం టీఆర్ఎస్ ఎన్నికల గుర్తుకు కారుకు విచిత్రమైన పోటీ ఏర్పడింది. ఆ పోటీ చివరకు ఒక చోట టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి దారి తీస్తే.. మరోచోట మెజారిటీ తగ్గించింది.

Image result for truck

నకరికల్‌ లో టీఆర్‌ఎస్ తరపున బరిలో దిగిన వేముల వీరేశంకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు అదృష్టం ఇండిపెండెంట్ రూపంలో అనుకోకుండా కలసివచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎస్‌ఎఫ్‌బీ పార్ట తరపున పోటీ చేసిన రవికుమర్ కు ఈసీ ట్రక్కు గుర్తును కేటాయించింది. ఇది అచ్చం కారు గుర్తులాగానే ఉండటంతో టీఆర్‌ఎస్‌ ఓటర్లు కూడా చాలా మంది కారు అనుకుని ట్రక్కుకు గుద్దేశారు.

Image result for car symbol election


దీంతో రవికుమార్ కు అనూహ్యంగా 10, 333 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ 8 వేల ఓట్లతో గెలిచింది. ట్రక్కుగుర్తు పోటీలో లేకపోతే.. టీఆర్‌ఎస్ 2 వేల ఓట్లతో విజయం సాధించేది. దాదాపు ఇలాంటి పరిస్థితే నాగార్జునసాగర్‌లోనూ కారు పార్టీకి ఎదురైంది. ఇక్కడ నోముల నర్సింహయ్య 7వేల800 ఓట్ల మెజారిటీతో జానారెడ్డిపై గెలుపొందారు.

Related image

ఇక్కడ కూడా ట్రక్కు గుర్తుపై పోటీ చేసిన అనామక అభ్యర్థికి 9800 ఓట్లు వచ్చాయి. అంటే ట్రక్కు గుర్తు లేకపోతే నోముల మెజారిటీ మరో 9 వేలు పెరిగి ఉండేదన్నమాట. ఈసీ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే సమయంలో ఒకేలాంటి గుర్తులు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఏదేమైనా ట్రక్కు కారు పార్టీకి ఓ ఎమ్మెల్యే సీటు పొగొట్టిందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: