ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుణ్ణి నమ్మి టిడిపితో పొత్తు పెట్టుకొన్న కాంగ్రెస్ - తొలిదెబ్బగా తెలంగాణాలో సర్వ నాశనమైపోయింది. చంద్రబాబు నాయుడి మాటలకు పడిపోయి పొత్తు పెట్టుకున్న రాహుల్ గాంధి అమాయకత్వం, విఙ్జతలేమిని సూచిస్తుంది. ఈ సువిశాల భారతావనికి నేతృత్వం వహించటానికి రాహుల్ సామర్ధ్యం సరిపోతుందా? అన్నది చాలా ప్రధానమైన విషయం. ఆఫ్ట్రాల్ చంద్రబాబు నాయుడు ఆఫర్ చేసిన పొత్తుకే (ఇంకేం ప్రలోభాలున్నాయో? తెలియదు) తన పార్టీ సీనియర్లతో సభ్యులతో మిత్రులతో చర్చలు లేకుండా పొత్తు అంగీకరించి పప్పులో కాలేసిన విషయం విశ్లేషకులను విస్మయ పరుస్తుంది. తెలంగాణాలో చంద్రబాబు అడుగుపెడితే సర్వం బస్మీ పటలం అవుతుందనేది ఐదేళ్ళ బాలుడైనా చెప్పగలడు. అలాంటిది 50 యేళ్ళకి దగ్గర పడుతున్న రాహుల్ కు తెలియక పోవటం కొద్దిగా కూడా మింగుడు పడట్లేదు వారందరికి. 
Image result for rahul gandhi innocence
ఇంకా దురదృష్టకరమైన విషయమేమంటే ఎన్నికల పలితాలు ప్రకటించి రోజులు గడచిపోతున్నాయి. మూడురాష్ట్రాల్లో ఏదురులేకుండా స్పష్టమైన ఆధిఖ్యతతో జయ కేతనం ఎగురవేసిన కాంగ్రెస్‌ పార్టీకి ఆ విజయాన్ని అరిగించుకునే శక్తి లేకపోవటం దురదృష్టకరమని పిస్తుంది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ విషయానికి వస్తే కాంగ్రెస్ యువ  నాయకులకు వృద్ధ నాయకులకు మధ్య తీవ్ర పోటీ ఉండటంతో కాంగ్రెస్‌ అధిష్టానానికి ఆరాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేయడం పులిమీద స్వారీగా మారింది. 
ముఖ్యంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రుల ఖరారుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతోంది.
Image result for rahul gandhi innocence
రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారు నేడు (గురువారం) కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసానికి వచ్చారు. ఇదివరకు ఏ సమావేశం జరిగినా 10 జన్‌-పథ్‌ లోని సోనియా గాంధీ నివాసంలో జరిగేది.  కానీ ఈసారి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక బాక్-గ్రవుండ్ వర్క్ చేయటా నికి  సోనియా గాంధీ,  ప్రియాంక గాంధీలు కూడా రాహుల్‌ గాంధీ నివాసానికి వచ్చారు. 
Image result for sachin pilot Vs ashok gehlot
రాజస్థాన్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికోసం అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ లు పోటీపడుతున్నారు. మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి కోసం కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్య సింధియాల మధ్య తీవ్రమైన పోటీగా మారింది. ఈ నలుగురితో విడి విడిగా రాహుల్‌ గాంధీ మాట్లాడారు. యువనేతలు సచిన్‌ పైలట్‌, జ్యోతిరాదిత్యలకు డిప్యూటీ సీఎం పదవులు యివ్వజూపినా వారు ఆ పదవులను తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.
Image result for jyotiraditya scindia vs kamal nath
ఎన్నికల్లో తాము కష్టపడితే సీనియర్లకు పదవులిస్తారా? అంటూ సచిన్‌, జ్యోతిరాదిత్య కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రుల బరి నుండి తప్పు కోవడానికి ఈ యువకిశోరాలు ఇష్టపడలేక పోతున్నారు. అందుకే పార్టీ అధిష్టానం, ఈ విషయంలో ఆయా రాష్ట్రాలలో ఎన్నికైన ఎమ్మెల్యేలతో మాట్లాడి నిర్ణయం తీసు కుంటానని రాహుల్‌ గాంధీ వారికి సర్దిచెప్పినట్టు తాజా సమాచారం. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రకటన ఇంకా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Image result for next chhattisgarh cm

Chhattisgarh CM to be Elected Like "Sita's Swayamvar" - Senior Congress Leader T S Singh Deo to News18

మరింత సమాచారం తెలుసుకోండి: