తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించి ఉండొచ్చు. కానీ మొదటి విడత పాలనలో కేసీఆర్ పాలన పట్ల విద్యార్థి, నిరుద్యోగ వర్గాలు మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నాయి. ఈ విషయాన్ని నేరుగా కేసీఆరే అంగీకరించారు. ఈసారి అలా చేయబోమంటూ గెలిచిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో అన్నారు. కానీ మళ్లీ కేసీఆర్ సర్కారు నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తోంది.

Image result for panchayat secretary result


మొన్నటికి మొన్న ఎన్నికల ముందు పంచాయతీ కార్యదర్శి పోస్టులను భారీ గా నియమించాలని తలచింది. ఈ నిర్ణయం బాగానే ఉంది. ఏకంగా 9 వేల పోస్టుల నియామకం చేపట్టింది. కానీ.. అందరు ప్రభుత్వోద్యోగులపై కరుణ చూపించిన కేసీఆర్.. ఎందుకో ఈ కొత్త పోస్టుల పట్ల అత్యంత కఠిన వైఖరి అవలంభించారు. కాంట్రాక్టు ఉద్యోగాలే ఉండవంటూ చెప్పుకొచ్చిన ఆయన ఈ పంచాయితీ కార్యదర్శులు మాత్రం మూడేళ్లు కాంట్రాక్టు పద్దతిలో పనిచేయాలని నిబంధన విధించారు.

Related image


అంతే కాదు.. నియమాక ప్రక్రియలోనూ అన్నీ అడ్డగోలు నిర్ణయాలే. ఈ నియామకం టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా జేఎన్‌టీయూ ద్వారా నిర్వహించారు. ఎన్నికల కారణంగా ఫలితాల వెల్లడి ఆగింది. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ సీఎం అయ్యాక ప్రక్రియ మొదలైంది. కానీ మెరిట్ లిస్టు, మార్కుల జాబితాలు ఏమీ ప్రకటించకుండానే జిల్లాల వారీగా ఎంపికైన వారి నెంబర్లు మాత్రమే ప్రకటిస్తున్నారు.

Image result for ap high court


ఏ నియామక ప్రక్రియలోనైనా పారదర్శకత అత్యంత ప్రాధాన్యం. కానీ ఎందుకనో కేసీఆర్ సర్కారు పారదర్శకతకు పాతర వేస్తోంది. దీంతో ఆగ్రహించిన కొందరు అభ్యర్థులు లోపాలను ఎత్తి చూపుతూ హైకోర్టుకు వెళ్లారు. వారి వాదన విన్న కోర్టు.. నియామక పత్రాలు ఇవ్వొద్దంటూ నియామక ప్రక్రియను ఆపేసింది. ఇకనైనా కేసీఆర్ సర్కారు ఇలాంటి హడావిడి నిర్ణయాలు కాకుండా ప్రతిదశలోనూ పారదర్శకత పాటిస్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: