దాదాపు 300 -400 యేళ్ళ పాటు మన దేశాన్నిఫ్రాన్స్, డచ్, డెనిష్, బ్రిటీష్ రాజ్యాలు పాలించాయి. నూరేళ్ళ స్వాతంత్ర సంగ్రామం తరవాత మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. అలాంటి భారత్ విదేశీ మూలాలున్న సోనియా గాంధి ప్రభుత్వ నేపధ్యంలో ఉండి దాదాపు మూడు దశాభ్దాలు అధికార కేంద్రంలో అనధికార భాగస్వామ్యం పంచు కుంది. దాదాపు భారత్ విదేసీ క్రీనీడలో ముక్కి మూల్గుతూనే ఉంది. మన ప్రతిపక్షం ఇప్పుడు బ్రిటీష్ కుటుంబానికి ఊడిగం చేస్తూనే ఉంది? బ్రిటీష్ పౌరుడు రాహుల్ గాంధి భారత ప్రదాని అవుతారా?

Image result for rahul swamy

2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించి, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ -ఐఎస్‌బీ లో శనివారం పూర్వ విద్యార్థులు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

 

సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ సంపాదకులు భూపేంద్ర చౌబే కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు. సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ, బ్రిటిష్‌ పౌరసత్వం ఉన్న రాహుల్‌ గాంధీ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించారు.

Image result for bhupendra chaubey 

హిందువుల మనోభావాలను గౌరవించి అయోధ్యలో మందిర నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగాలేదని, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పనితీరు సంతృప్తికరంగా లేదని వ్యాఖ్యానించారు. ఆయన స్థానంలో తనను మంత్రిగా నియమిస్తేసేవలందించేందుకు సిద్ధమని చెప్పారు. కొత్తగా ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులైన శక్తికాంత దాస్‌ అవినీతిపరుడని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తాననడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

Image result for isb hyderabad

మరింత సమాచారం తెలుసుకోండి: