జనసేన ఎన్నికల గుర్తు పై సెటైర్లు పేలుతున్నాయి. ఎన్నికల కమిషన్ జనసేనకు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసుగా కేటాయించిన నాటి నుంచి జనసైనికులు ఆ గుర్తును విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో జోరు పెంచేశారు. పవన్ కల్యాణ్ టీ గ్లాసుతో ఉన్న ఫోటోలతో తమ గుర్తుకు ప్రచారం చేసుకుంటున్నారు.

Related image


ఐతే.. ఈ గాజు గ్లాసు గుర్తుపై సెటైర్లు కూడా బాగానే పడుతున్నాయి. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ అంటే చాలు విమర్శలకు రెడీగా ఉండే వివాదాస్పద నటి శ్రీరెడ్డి ట్విట్టర్ ద్వారా ఈ ఎన్నికల గుర్తుపై సెటైర్లు పేల్చింది.

Related image


అరె.. జనసేన పార్టీ గుర్తు గలాసు అంటగా.. అది బీరు గ్లాసా.. వైన్ గ్లాసా.. స్కాచ్ గ్లాసా.. అంటూ కొత్త సందేహాలు వెలిబుచ్చింది. ఇప్పటివరకూ గాజు గ్లాసును ఈ స్థాయిలో ఎవరూ పోల్చలేదు. అంతే కాదు.. శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ పైనా సెటైర్లు గుప్పించేసింది.

Related image


పనిలో పనిగా నాగబాబు గారికి కూడా ఓ గ్లాస్‌ ఇవ్వండర్రా.. అసలే రీసెంట్‌గా కొత్త గొంతు వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు.. అంటూ ఏకేసింది. ఇటీవల ఎక్కడా వార్తల్లో లేని ఈ భామ మళ్లీ ప్రచారం కోసం పవన్ కల్యాణ్ ను కెలికినట్టు కనిపిస్తోందిమరి పవన్ కల్యాణ్ అభిమానులు ఊరుకుంటారా..?


మరింత సమాచారం తెలుసుకోండి: