ఈ సంవత్సరం అయ్యప్ప స్వామిపై ఎన్నో రకాల వార్తలు వస్తున్న విషయం గమనిస్తూనే ఉన్నాం.  50 సంవత్సాల లోపు ఉన్న మహిళలు సైతం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని కోర్టు సంచలన తీర్పు ఇచ్చినప్పటి నుంచి ఎన్నో వివాదాలు చెలరేగుతున్నాయి.  ఇప్పటికీ శబరిమలలో టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది.  తాజాగా మరో అయ్యప్ప స్వాములకు షాకింగ్ న్యూస్.. రైలు ప్రయాణ సమయంలో పూజల పేరిట దీపం, హారతి కర్పూరం తదితరాలను వెలిగిస్తే, కఠిన చర్యలు తప్పవని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో హెచ్చరించింది.

రైళ్లలో నిప్పు వెలిగించి పట్టుబడితే రూ. 1000 వరకూ జరిమానా, మూడు సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉందని తెలిపింది.  కాగా, అయ్యప్ప స్వాముల కోసం వివిధ ప్రదేశాల నుంచి రైలు సౌకర్యాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులు బోగీలలో పూజలు చేసి, హారతుల పేరిట కర్పూరం వెలిగిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి.

ఇటీవల కోయంబత్తూరు మీదుగా వెళుతున్న స్పెషల్ రైలులో భక్తులు దీపం పెట్టడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వారిని మందలించి వదిలిపెట్టారు.  అంతే కాదు ఈ తరహా చర్యలు వికటిస్తే ఘోర అగ్ని ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తున్న ఉన్నతాధికారులు, అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను తరలించడం శిక్షార్హమని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: