గత కొంత కాలంగా ట్రిపుల్ తలాక్ బిల్లు ఎన్నో చర్చలు జరుగుతూ వచ్చాయి.   ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్ సభలో ఈరోజు వాడీవేడీ చర్చ కొనసాగింది. ఈ బిల్లు పట్ల కేంద్రం తీరును నిరసిస్తూ సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో, సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో బిల్లుపై చర్చకు సహకరించాలని సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు.

అయితే ట్రిపుల్ తలాక్ బిల్లు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, ఈ బిల్లు ద్వారా ముస్లిం మహిళలకు రక్షణ కలుగుతుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, ట్రిపుల్ తలాక్ బిల్లుపై కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని, దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. 
Image result for త్రిపుల్ తలాఖ్ ఆమోదం
కాగా, త్రిపుల్ తలాక్ బిల్లుపై వీగిపోయిన అసదుద్దీన్ ఒవైసీ సవరణలు.  దాంతో బిల్లును వ్యతిరేకిస్తూ లోక్ సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్, అన్నాడీఎంకె.  త్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా 245 మంది ఓటింగ్. వ్యతిరేకంగా 11 మంది ఓటింగ్ నమోదు అయ్యాయి. గందరగోళ పరిస్థితుల్లోనే  ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆయోదం పలికింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: