సృష్టిలో అమ్మ అనే పదం ఎంతో కమ్మనైనది..వివాహం జరిగిన తర్వాత ప్రతి మహిళా తాను అమ్మ కావాలని ఎన్నో కలలు కంటుంది.  తన కుటుంబానికి వారసుడినో..వారసురాలినో ఇచ్చి సంతోష పెట్టాలని కోరుకుంటుంది.  ఓ గృహిణిగా ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తుంది.  అయితే కొన్ని సార్లు దేవుడి శాపమో..అనారోగ్య ఫలితమో తల్లికాలేని పరిస్థితిలు మహిళలు ఎన్నో బాధలు పడుతుంటారు.  ఈ మద్య సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు ఇట్టే వైరల్ అవుతున్నాయి. 

తాజాగా జమ్ముకశ్మీర్‌లో 65 ఏళ్ల బామ్మ పండంటి పాపాయికి జన్మనిచ్చి సరికొత్త చరిత్ర సృష్టించింది.  అయితే ఆ మహిళ పేరు మాత్రం తెలపలేదు. కాగా, ఆమె భర్త హకీం దీన్ వయసు 80 సంవత్సరాలు. పూంచ్ జిల్లా ఆసుపత్రిలో ఆమెకు డెలివరీ చేసిన వైద్యులు మాట్లాడుతూ.. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన అని తెలిపారు.  సాధారణంగా వృద్దాప్యంలో రుతు క్రమం నిలిచిపోయిన తర్వాత గర్భం దాల్చే అవకాశాలు ఉండవన్నారు.

65 ఏళ్ల బామ్మకు ఇప్పటికే పదకొండేళ్ల కుమారుడు ఉండగా ఆమెకు ఇది రెండో కాన్పు.  గతంలో లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళగా స్పెయిన్‌కు చెందిన 66 ఏళ్ల మారియా డెల్ కార్మెన్ బౌసదా దెలారా రికార్డులకెక్కింది.  కాకపోతే ఆమె సహజ సిద్దంగా కాకుండా ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చి జన్మనిచ్చింది. జమ్ముకశ్మీర్‌లో పూంచ్ జిల్లా పండండి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మాత్రం సహజ సిద్ధంగా బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రపంచ రికార్డులోకి ఎక్కనున్నట్లు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: