మనకు ఇప్పుడు ఏ సందేహం వచ్చినా ముందుగా చేసే పని గూగ్లింగ్.. అందుకే దీన్ని ఇప్పుడు అంతా గూగుల్ తల్లి అని పిలుచుకుంటున్నారు. ప్రపంచంలో ఏ విషయం గురించైనా సరే.. గూగుల్, యూట్యూబ్, వికీపీడియా.. ఈ ముగ్గురే గురువులు.

Image result for question the world asked google in 2018


అందులోనూ అగ్రస్థానం గూగుల్ దే. మరి ఈ 2018 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ను ఏ ఏ ప్రశ్నలు అడిగారో తెలుసుకుందామా.. అన్నింటికంటే ఎక్కువగా అడిగిన ప్రశ్న బ్రిటీష్ రాజకుమారుడు హేరీ వయస్సు ఎంత అని. రెండో ప్రశ్న హేరీ వివాహం చేసుకున్న మేఘాన్ మార్కెల్ వయస్సు ఎంత అని.

Image result for harry and markle


మరి ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలుసా.. తెలియకపోతే తెలుసుకోండి. ప్రిన్స్ హేరీ వయస్సు 34 అయితే.. మార్కెల్ వయస్సు 37. ఈ రెండు ప్రశ్నల తర్వాత ఎక్కువగా అడిగిన ప్రశ్న క్రోయేషియా అనే దేశం ఎక్కడ ఉంది అని. ఎందుకంటే ఫుట్ బాల్ ప్రపంచ కప్ పోటీల్లో ఈ దేశం మొట్టమొదటిసారి పైనల్‌కు చేరుకుంది.

Image result for croatia map


దీంతో ఈ దేశం ఎక్కడ ఉందన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. ఇంతకీ ఈ ప్రశ్నకు మీకు జవాబు తెలుసా.. క్రోయేషియా దేశం యూరప్‌కు ఆగ్నేయ దిశలో ఇటలీకి సమీపంలో ఉంటుంది.

Image result for floss dance


ఆ తర్వాత ఫ్లోస్ డ్యాన్స్ ఎలా చేయాలి.

Image result for bitcoin


బిట్ కాయిన్ అంటే ఏమిటి.. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు.. అనే ప్రశ్నలు అడిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: