గుంటూరు జిల్లా స‌త్తెనప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావుకు ఎదురు గాలి వీస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ పెద్ద‌గా అభివృద్ధి ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని, ఎక్క‌డా కూడా ప్ర‌జ‌లు సం తృప్తిగా ఉండ‌డం లేద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల్లో న‌ర‌స‌రావు పేట నుంచి పోటీ చేయాల‌ని అను కున్నా.. అప్ప‌టి బీజేపీతో పొత్తు నేప‌థ్యంలో ఈ టికెట్‌ను బీజేపీకి కేటాయించారు. దీంతో అయిష్టంగానే కోడెల స‌త్తెన ప‌ల్లిలో పోటీ చేయాల్సి వ‌చ్చింది. దీంతో ఆయ‌న మ‌నిషిగా స‌త్తెన ప‌ల్లిలో ఉన్నా.. మ‌న‌సు మాత్రం పూర్తిగా న‌ర‌స‌రావు పేట‌పై నే ఉంది. దీంతో ఇక్క‌డ అభివృద్ధి అంతంత మాత్రంగా మారిపోయింది. 


దీనికితోడు.. స‌త్తెన‌ప‌ల్లిలో పెద్ద‌గా నివాసం ఉండేందుకు కూడా స్పీక‌ర్ ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. న‌ర‌స‌రావుపేట‌తో ఆయ‌న‌కు కొన్ని ద‌శాబ్దాల అనుబంధం పెన‌వేసుకుపోవ‌డంతో ఆయ‌న ఇక్క‌డే అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా స‌త్తెన‌ప‌ల్లికి వెళ్లేందుకు కూడా ఆయ‌న పెద్ద‌గా దృష్టి పెట్ట‌డం లేదు.ఇక‌, అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో గుంటూరులోనే ఉంటున్నారు. దీంతో స‌త్తెన‌ప‌ల్లి ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు పెద్ద‌గా పాజిటివ్ టాక్ లేకుండా పోయింది. ఈ విష‌యాల‌ను గ‌మ‌నిస్తున్న ఇక్క‌డ వైసీపీ త‌మ‌కు ప్ర‌చారం లేక‌పోయినా గెలిచేస్తామ‌నే ధీమా వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌స‌రావుపేట నుంచి పోటీ చేయాల‌ని చూస్తున్నార‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. 


ఇదిలావుంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోడెల త‌న‌తోపాటు త‌న కుమారుడిని కూడా పోటీ చేయించాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పోక‌స్ అంతా కూడా త‌న కుమారుడిపైకి మ‌ళ్లించారు. ఈ ప‌రిణామాలు కూడా ప్ర‌జ‌ల‌కు ఆయ‌న‌ను దూరం చేశాయి. న‌ర‌స‌రావుపేట‌లో ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కుడు గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆయ‌న‌పై వ్య‌క్తిగ‌తంగా మ‌రీ అంత వ్య‌తిరేక‌త క‌న‌ప‌డ‌డం లేదు. ఇక్క‌డ గోపిరెడ్డి బ‌లంగా ఎక్క‌డ పాతుకుపోతారో అనే దిగులు మాత్రం కోడెల‌లో స్ఫష్టంగా క‌నిపిస్తోంది. దీంతో ఆయ‌న మ‌న‌సంతా కూడా న‌ర‌స‌రావుపేట‌పైనే పెట్టి ముందుకు సాగుతున్నారు. ఇక్క‌డ ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. ఆయ‌నే ముందుంటున్నారు. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న రాజ‌కీయ నేత‌లు కూడా స్పీక‌ర్ రాజ‌కీయాల‌పై విస్మయం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఈ ప‌రిణామం ఎటు వెళ్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: