ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.  ఈ నేపథ్యంలో ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి.  ఇప్పటికే అధికార పక్షం తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్తూ..మరోసారి గెలిపిస్తే..ఏపి అభివృద్దికి పాటుపడతాం అంటూ ప్రచారం చేస్తున్నారు.  వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ‘ప్రజా సంకల్ప యాత్ర’తో ప్రజల్లోకి వెళ్లారు.  మరోవైపు నటుడు పవన్ కళ్యాన్ ‘జనసేన’పార్టీ తరుపు నుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మద్య జనసనకు గాజు గ్లాస్ గుర్తు ఇచ్చారు.

ఇదిలా ఉంటే..కర్నూలు జిల్లాలో టీడీపీ కి ఊహించని షాక్ తగిలింది. ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి రాజీనామా చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అఖిలప్రియ ప్రభుత్వ పథకాల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అఖిలప్రియ అవినీతి వ్యవహారంపై తెలుగుదేశం హైకమాండ్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకే తాను పార్టీ మారనున్నానని  సన్నిహితులతో తేల్చిచెప్పారట రాంపుల్లారెడ్డి తన రాజీనామాతో అందరికీ ఝలక్ ఇచ్చారు. రాజీనామాకు ముందు శనివారం ఆళ్లగడ్డలో తన అనుచరులతో సమావేశమైన టీడీపీ నేత రాంపుల్లారెడ్డి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించినట్లు సమాచారం. ఇరిగెల బాటలోనే పలువురు మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల్లో అనూహ్య మార్పులు వస్తుంటాయి.మరో రెండు మూడు రోజుల్లో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాగా, రాంపుల్లా రెడ్డి వైసీపీలో చేరే అవకాశముందని ఆయన సన్నిహిత వర్గాలు తెలుపుతున్నారు..మరి రానున్న రోజుల్లో ఏం జరగనుందో తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: