ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన ప్రకటన చేశారు. తాను ఏపీ ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఇటీవల తెలంగాణలో కేసీఆర్ విజయాన్ని ఏపీలో వైసీపీ, జనసేన శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నాయని.. ప్రత్యేక హోదా అడ్డుకుంటున్న కేసీఆర్ గెలిస్తే వీరికి సంతోషం ఎందుకని చంద్రబాబు తరచూ విమర్శిస్తున్నారు.

Image result for kcr press meet


శనివారం మీడియాతో ఈ విషయంపై విస్తృతంగా మాట్లాడిన చంద్రబాబు.. తాను ఎప్పుడూ ప్రత్యేక హోదాను అడ్డుకోలేదని.. వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. తన పార్టీ పార్లమెంట్‌ సహా అనేక వేదికలపై ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. తమ పార్టీ నేతలు కె.కేశవరావు, కవిత, జితేందర్‌రెడ్డి అనేక సార్లు ఈ విషయంపై స్పష్టమైన ప్రకటనలు చేశారన్నారు.

Image result for ap special status


అసలు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే స్పష్టంగా ఉందని కేసీఆర్ వివరించారు. ఈ చట్టంలోని సెక్షన్ 94లోని 1, 2 క్లాజుల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాలకూ పన్నురాయితీలు ఇవ్వాలని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని క్లియర్ గా ఉందని గుర్తు చేశారు. అవసరమైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి తాను ఉత్తరం రాసేందుకు కూడా సిద్దమని కేసీఆర్ చెప్పారు.

Image result for kcr press meet


అసలు ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబుకే క్లారిటీ లేదని విమర్శించారు. మొన్నటి వరకూ మోడీ చంకనెక్కిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్పిన విషయం మరిచిపోరాదన్నారు. హోదా పెరెత్తితే జైల్లో పెడతానని హెచ్చరించిన రోజులు మర్చిపోయారా అని కేసీఆర్ ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: