శనివారం సుదీర్ఘంగా ప్రెస్ మీట్ నిర్వహించిన కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు రెండు పత్రికలనూ టార్గెట్ చేశారు. ఒక్కసారి కాదు.. పదే పదే ఆ రెండు పత్రికలు అంటూ ఒకనాటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని తలపింపజేశారు. కేసీఆర‌ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఆ పత్రికలను టార్గెట్ చేయలేదు. అసలు కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాన పత్రికల పట్ల సానుకూలంగానే ఉన్నారు. పత్రికాధిపతులతో స్నేహం కూడా చేశారు.


ఒక దశలో ఓ పత్రిక, ఛానల్ పై అనధికారికంగా నిషేధం అమలైనా.. ఆ వివాదం తర్వాత సర్దుకుంది. కానీ గత ఎన్నికలకు ముందు రెండు ప్రధాన దినపత్రికలు మహా కూటమి ప్రభంజనం సృష్టించబోతోందంటూ కలరింగ్ ఇచ్చాయని కేసీఆర్ భావిస్తున్నారుతాను ఎంత సానుకూలంగా ఉన్నా.. ఈ రెండు పత్రికలు చంద్రబాబు అనుకూల వైఖరినే చూపిస్తాయన్న అభిప్రాయానికి వచ్చేశారు.

Image result for kcr vs abn radhakrishna


అందుకే రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పత్రికలపై దాడి ప్రారంభించేశారు. ఈ రెండు పత్రికలు చంద్రబాబుకు బాకా పత్రికలంటూ శనివారం ప్రెస్ మీట్‌లో పలుసార్లు కేసీఆర్ విమర్శించారు. చంద్రబాబు ఏం చేసినా ఆహా.. ఓహో.. అని చంద్రబాబు చెప్పిన ప్రతిదీ నిజమేనేమో అనే స్థాయిలో ఈ బాకా పత్రికలు రాసి జనాన్ని తప్పుదోవపట్టిస్తున్నాయని కేసీఆర్ అన్నారు.


Related image


చంద్రబాబు స్వయం ప్రకాశ నాయకుడు కాడని.. ఈ రెండు బాకా పత్రికలను అడ్డుపెట్టుకుని మేనేజ్ చేస్తున్నాడని కేసీఆర్ మండిపడ్డారు. తన విశాఖ పర్యటనలో స్థానిక ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తే దాన్ని కూడా ఈ రెండు పత్రికలు వక్రీకరించి రాశాయని విమర్సించారు. ఓ పత్రిక వైసీపీ వాళ్లు స్వాగతం పలికారని రాస్తే.. మరో పత్రిక వెలమలు స్వాగతం పలికారని రాశాయని గుర్తు చేశారు. మరి కేసీఆర్ ఈ స్థాయిలో ఆ రెండు పత్రికలు అని పైర్ అయ్యాడంటే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: