తెలంగాణ సీఎం కేసీఆర్‌ శనివారం ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రెస్ మీట్‌ పెట్టి మరీ నిప్పులు చెరిగారు. డర్టీయస్ట్ పొలిటీషియన్, సిగ్గూ లజ్జా ఉన్నాయా.. పచ్చి అబద్దాల కోరు.. పచ్చి అవకాశవాది.. అంటూ రెచ్చిపోయారు. అసలు చంద్రబాబు స్వయం ప్రకాశం ఉన్న నాయకుడు కాదు.. ఆయన నాయకుడు కాదు ఓ మేనేజర్ అంటూ ఈసడించారు.

హైదరాబాద్ లో ఐటీకి చంద్రబాబు పీకిందేమీ లేదని.. సైబర్ టవర్స్ వచ్చేందుకు రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కారణమంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేతకాని దద్దమ్మ అంటూ రెచ్చిపోయారు. దాదాపు గంటపాటు సాగిన ఈ ప్రెస్ మీట్ చాలావరకూ చంద్రబాబును విమర్శించేందుకే సరిపోయిందికేసీఆర్ ఈ స్థాయిలో సీఎం చంద్రబాబును తిడితే తెలుగుదేశం మంత్రులు ఊరుకుంటారా.. వారూ రెచ్చిపోయారు. ముందుగా స్పందించిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి



కేసీఆర్ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి గురించి చెత్త భాష మాట్లాడారని మండిపడ్డారు. దేశంలో ఏ సీఎం కూడా ఇంతగా దిగజారుడు భాష మాట్లాడరని విమర్శించారు. అంతే కాదు.. అదే ప్రెస్‌ మీట్‌లో ఆయన మీడియాకు ఓ పాత వీడియో క్లిప్పింగ్ చూపించారు.



2009 లో టీడీపీ, టీఆర్ఎస్ మహాకూటమిగా ఏర్పడిన సమయంలో కేసీఆర్ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడిన మాటల క్లిప్పింగులను మీడియాకు చూపించారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. సంపద ఎలా సృష్టించాలో చంద్రబాబుకు బాగా తెలుసని.. ఏపీ బడ్జెట్‌ను 55 వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదేనని ఆ వీడియో కేసీఆర్ అన్నారు. గతంలో బడ్జెట్ పెరుగుదలకు కారణం చంద్రబాబు అంటూ పొగిడిన కేసీఆర్ ఇప్పుడు అవాకులు చెవాకులు మాట్లాడటం ఏమిటని సోమిరెడ్డి విమర్శించారు.


Image result for kcr and chandrababu in mahakutami 2009


మరింత సమాచారం తెలుసుకోండి: