గత రెండు రోజులుగా ఇద్దరు చంద్రుల పోరుతో వార్తలు వేడెక్కిపోయాయి. మొదటి రోజు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. దానికి కౌంటర్‌గా చంద్రబాబు కూడా అదే రేంజ్‌లో కౌంటర్లను ఎన్ కౌంటర్ చేశారు. దీంతో రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదాను మేం ఎప్పుడూ వ్యతిరేకించలేదంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.



పార్లమెంట్‌లోనూ.. అనేక వేదికలపై మేం ఏపీకి ప్రత్యేక హోదా ఇమ్మనే చెప్పామంటూ కేసీఆర్ చెబితే.. అహా.. అలాగా.. మరి సోనియా గాంధీ మేడ్చల్‌ మీటింగ్‌లో ఏపీకి హోదా ఇవ్వాలని మాట్లాడితే మీ హరీశ్ రావు వ్యతిరేకించలేదా.. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయలేదా అంటూ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిస్తూనే.. కేసీఆర్, జగన్‌ కుమ్మక్కయ్యారనే పదే పదే ఎత్తి చూపారు



కేసీఆర్, జగన్ మోడీకి ప్రతిరూపాలని దుయ్యబట్టారు. ఇప్పుడు ఈ హోదా మాటల యుద్ధంపై కామెంట్‌ చేస్తూ వైసీపీ అధినేత జగన్ చంద్రబాబు ట్రాప్‌లో పడిపోయారనిపిస్తోందికేసీఆర్ ప్రత్యేక హోదాపై లేఖ ఇస్తానంటే చంద్రబాబు దానిపైన కూడా రాజకీయం చేస్తున్నారని జగన్ తన పాదయాత్రలో విమర్శించారు. పురాణాల్లో కుంభకర్ణుడి జాతికి చెందిన నారాసురుడు చంద్రబాబు అంటూ తీవ్రంగా కామెంట్ చేశారు.



కేసీఆర్ ప్రకటనను స్వాగతించాల్సిందిపోయి విమర్శిస్తారేంటి అని చంద్రబాబును ప్రశ్నించారు జగన్. ఇది వాస్తవమే అయినా కేసీఆర్, చంద్రబాబు మాటలయుద్ధంలో కేసీఆర్‌ను జగన్ వెనకేసుకొస్తే టీడీపీ ఆరోపించినట్టు ఆ ఇద్దరూ కుమ్మక్కయ్యారని ఏపీ జనం భావించే అవకాశం ఉంది. అది జగన్‌కు రాజకీయంగా నష్టం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. చూస్తుంటే చంద్రబాబు విసిరిన ట్రాప్‌లో జగన్‌ పడిపోయినట్టే కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: