పిల్లనిచ్చిన మామను, తన పదవి అధికార దాహానికి వెన్నుపోటుతో బలిచ్చిన, ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితకాలంలో మాయని మచ్చను మిగుల్చు కున్నారు.  అందుకే ఆయన్ని ఈ కాలపు ఔరంజేబుగా సాక్షాత్తు వెన్నుపోటుకు బలైన ఎన్ టీఆరే ప్రవచించారు. వెన్నుపోటు అనేది ఉభయ తెలుగురాష్ట్రాల చరిత్రలో ఎవరూ మరవలేని చారిత్రాత్మక ఘట్టం. 


ఎన్టీఆర్ కు ఆ వయసులో కుటుంబం అంత మంది కుమారులు కూతుళ్ళు ఉండి కూడా  అందించలేని అండ ని తోడును లక్ష్మిపార్వతి ఇవ్వగా-దాన్ని రాజకీయం చేసి అధికారం ఆమె చేతుల్లోకి పోతుందన్న భ్రమను కలిగించి మొత్తం కుటుంబం వర్సెస్ ఎన్ టీఆర్ గా మార్చి చిన్నల్లుడు చంద్రబాబు విభేధాగ్నిని రగిల్చారు. ముందుగా పథకం ప్రకారం ఆయన కుటుంబంలో రాజకీయనాటకం నడిపించి సమూలంగా ఆ కుటుంబానికి ఎన్టీఆర్ ను దూరం చేసిన జామాతలు  నందమూరి ఇంటి దశమ గ్రహాలైన నారా చంద్రబాబు నాయుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులు శకునిలా కపటనాటక సూత్రధారులై మొత్తం కన్న కుమారుల్ని కూతుళ్ళని వ్యతిరేఖంగా సమాయత్తం చేసి ధారుణంగా వారిమధ్య విబేధాలు పెంచేశారు.
viceroy episode కోసం చిత్ర ఫలితం
ఆపై శాసనసభ్యుల మద్య కూడా వైస్రాయ్ హోటల్ సాక్షిగా రాజకీయంగా ఆయన్ని ఒంటరిని చేసి అంతటి గొప్ప ప్రజాభిమానం ఉన్న ఎన్టీఆర్ పై చెప్పులు* వేయించిన ఘనులా జామతలు.


*ఆ దుస్థితి ఆనాడు ఎన్టీఆర్ అభిమానులమైన మేమంతా వైస్రాయ్ హోటల్ సాక్షిగా వీక్షించాం - ఆ వక్రీకరణ వ్యూహమంతా చంద్రబాబు ఆత్మగా విలసిల్లు తున్న ఈనాడు దినపత్రికలో చదివాం కూడా!
viceroy episode కోసం చిత్ర ఫలితం
చివరకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచి అధికారాన్ని పదవులను సంపదను లాగేసుకున్న చంద్రబాబు తనే తన జీవితాన్ని  కళంకంగా మార్చు కున్నారు. ఆ మచ్చ పచ్చబొట్టులా చెరిగిపోనిది. ఎన్ని మంచి పనులు చేసినా ఈ మచ్చను ఆయన జీవితంలోను,  జీవితానంతరం కూడా తొలగించుకోలేరు. రాజకీయంగా ఎవరెలా తగలడ్డా నైతికంగా అల్లుళ్ళిద్ధరు వారి ప్రోద్బలంతో ఆయన మానసిక కుంగుబాటుకు కారణమైన మొత్తం నందమూరి కుటుంబం ఈ మోసానికి ధారుణానికి కారకులే. ఎన్ని సినిమాలు తీసుకున్నా చివరకు మిగిలేది "తండ్రికి చేసిన ద్రోహమే వెన్నుపోటే అఘాయిత్యమే" ఈ మహాపాతకానికి జవస్త్వాలు రూపం ఇచ్చి, అత్యధిక ప్రయోజనం పొందిన చంద్రబాబు ఎనాటికి క్షమార్హుడు కాదు! 
viceroy episode కోసం చిత్ర ఫలితం 


ఈ కథ ఇప్పుడెందుకంటే:

తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ఉనికి లేకుండా చేయాలన్నది తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక. కానీ కేసీఆర్ ఆ కోరిక నెరవేరకుండా చేసేందుకు ఏకంగా తమ పార్టీ పునాదులనుండి తమ ఆగర్భ శత్రువుగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్ తోనే, టిడిపి నియమాలు పద్దతులు విధానాలను తుంగలో తొక్కి పొత్తు పెట్టుకున్న వ్యక్తి చంద్ర బాబు. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతూ ఒకరినొకరు దొరికిన సంధర్భాన్ని వదలకుండా వీధుల్లో విమర్శలతో పోరాడుతున్నారు. 
viceroy episode కోసం చిత్ర ఫలితం
స్వతహాగా బహు చమత్కారి, మాటకారి అయిన కేసీఆర్ ఎప్పటి కపుడు బాబుపై తన పడికట్టు పదాల మద్య బూతులతోనో అసభ్యపదాలతోనో అల్లిన మాటకారి తనంతో కూడిన సామెతలతో, తెలంగాణా ప్రజలు తప్పుగా ఫీలవ్వని పదప్రయోగాలతో ఎత్తుకు పైయెత్తులతో తన ఆధిక్యతను సాధిస్తున్నాడు. మొన్న ప్రగతి భవన్లో జరిగిన ప్రెస్-మీట్ లో కేసీఆర్ అభ్యంతరకరమైన భాష కూడా వాడి చంద్రబాబును ఎడాపెడా తిట్టినతిట్టు టిట్టకుండా తిట్టాడు. అంతేనా... చంద్రబాబు తన జీవిత కాలంలో సాధించింది "జీరో" అనేశాడు. తనకు తెలిసిన కొన్ని సాక్ష్యాలు చెబుతూ చంద్రబాబు రాజకీయ ప్రాణవాయువును అతి సునాయాసంగా సైకిల్ టైరులోని గాలి తీసినట్లు తీసేశాడు.
సంబంధిత చిత్రం
అసలే ఈ మద్య అనుమానాస్పధంగా ఉన్న చంద్రబాబు తీరు, నడవడి, తాను చెయనివీ, సందర్భానుసారంగా చేయాల్సిన విషయాలను పనులను ఇంతింత చేసి గొప్ప గా చెప్పుకోవటం, పదే పదే ద్ధాలాడటం,  ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాప్రయత్నంలో ప్రభుత్వం ప్రవర్తించిన తీరు న్యాయస్థానం సైతం తప్పుపట్టిన తరుణంలో అందరి కీ బాబుగారి తీరింతేనా, అని అవగతమైన తరుణంలో కెసీఆర్ కొట్టిన దెబ్బ ఆ నష్టం కూడా రాజకీయంగా సామాన్యమైనది కాదు. ఎప్పుడు టివి లో కనిపిస్త, స్వోత్కర్షలు చేసుకునే బాబుపై కేసీఆర్ విరుచుకుపడటం జనంలో ప్రాధాన్యత సంతరించుకుంది.   


సాధారణంగా కేసీఆర్ ఏమైనా అంటే వెంటనే "రిటార్ట్" ఇచ్చే చంద్రబాబు నిన్న కేసీఆర్ ఇచ్చిన సాక్ష్యా ధార రహిత విమర్శలకు ఎలా స్పందించాలో? కుడితిలోబడ్ద ఎలుకలా పాలుపోక తరువాత రోజు స్పందించారు. దీంతో, ఏదేదో చేయబోయి ఇంకేదో అయ్యిందే అన్న సినిమా పాట లాగా నోటికొచ్చింది మాట్లాడేశారు. చివరకు జీవితకాలం రాజకీయంగా కుటుంబపరంగా తాను గుదిబండలా మోస్తున్న ఒక నిజాన్ని కేసీఆర్ కు మీదకు కూడా తోసేసి కొంత బురద ఆయనకూ అంటించే ప్రయత్నం చేశారు. 
viceroy episode కోసం చిత్ర ఫలితం
అయితే దాని వల్ల కేసీఆర్ కు నష్టం జరగకపోగా ఇప్పటివరకు కొందరైనా నిందగా భావించే నిజాన్నిబాబు తనకు తానే అంగీకరించి చరిత్ర మరువలేని కఠోర సత్యంగా మార్చేసుకున్నారు. దీనికి సవరణ అనేదే లేదు, ఉండదు. అయితే నిశ్చయంగా మరోసారి తను చేసిన తప్పు చంద్రబాబే స్వయంగా జనాలకు చెప్పినట్లయ్యింది.


ఇప్పటికీ చంద్రబాబును వెంటాడుతూ, వేటాడుతున్న ఆ రాజకీయ కుటుంబ నైతిక రాహిత్య కళంకం మచ్చ ప్రత్యర్థులకే ఇప్పుడు తన  ప్రాణాంతక అస్త్రంగా ఉపయోగపడుతోంది. అయితే అది తనను వదిలేలా లేదని ఫిక్సయిన చంద్రబాబు అందులో కేసీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేయగా, అది ప్రతిపక్షాలకు పాశుపతాస్త్రమై కూర్చుంది. వైస్రాయ్ హోటల్ వ్యవహారంలో నేను పాత్రధారిని - కానీ సిద్ధాంతకర్త - వ్యూహకర్త - కేసీఆరే అని ఆరోపించారు. ఆ ఎపిసోడ్ తోనే కేసీఆర్ మంత్రి అయ్యారని చెప్పారు.
kcr vs chandrababu కోసం చిత్ర ఫలితం
ఈ మాట, చంద్రబాబు తొందరతో, మహాతప్పిదం చేయించింది. ఒకటి... ఎన్టీఆర్ ను తన పదవి కోసమే దింపాను అని తానే ఒప్పేసుకోవడం- రెండోది దానికి సాయం చేసినందుకు కేసీఆర్ కు మంత్రిపదవి బహుమతి ఇవ్వడం.


తన మామను తానే చంపేసుకుంటా అనేవాడికి ఆయాచిత లేదా  ఉచిత సలహా ఇచ్చినంత మాత్రాన మంత్రిపదవి బహుమతిగా ఇచ్చే వాడు తెలివితక్కు వోడు గానే కనిపిస్తాడు. తాను సలహా ఇవ్వకపోతే మరొకడు ఇస్తాడు కాబట్టి కేసీఆర్ ఆ పని చేసి మంత్రి పదవి పొందాడు. ఇంట్లోవాడు తన కొంపతానే తగలెట్టుకుంటుంటే బయటి వాళ్ళకి అంటే - కేసీఆర్ లాంటి వాళ్ళకు నష్టం లేదు కదా! అందుకే కేసీఆర్ కు అంటే బురద కాదది.
kcr vs chandrababu కోసం చిత్ర ఫలితం
కాకపోతే కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వబోయి బాబు తానే మురికి గుంటలో పడి జన సామాన్యంలో నేఱస్తుడుగా నిలబడ్దాడు తనను తానే ఇరికించేసుకున్నాడు.  వైస్రాయ్ ఎపిసోడులో తాను ఎన్టీఆర్ కు వేసింది వెన్నుపోటే! సూత్రధారి మాత్రం కేసీఆర్ అంటూ దుర్మార్గం ఒప్పుకున్నాడు చంద్రబాబు.  నైతిక నేరం దీంతో ఋజువైనట్లైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: