ఓటుకు నోటు కేసు టివిలో సినిమాలా చూశాక ప్రజాస్వామ్యం దాని విలువలపై ప్రజలకు నమ్మకమే సడలిపోయింది. ఓక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే రాష్ట్రంలోని ప్రజాప్రతి నిధిని ఎంతతేలిగ్గా కొనెయ్యచ్చో "బ్రీఫ్డ్ మీ" వీడియో ద్వారా నిరూపించారు. అది రికార్డు అవబట్టే తెలంగాణా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోబట్టే ఈ దురాగతం కోర్ట్ లలో ఎలా పోయినా ఎమెల్యేలను కొనటం అమ్మటం రెండూ మర్కెట్ కెళ్ళి చేపలు కొన్నంత తేలిక అని అర్ధమౌతుంది. దానికి కావలసింది అడ్డదారుల్లో సంపాదించిన డబ్బు మాత్రమే.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం తర్వాత ఆ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌ లో చేరారు. వీరి మాదిరిగానే ఇటీవలే కాంగ్రెస్ తరపును గెలుపొందిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోడానికి సిద్దంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. 
gandra venkataramana reddy duddilla sridhar babu కోసం చిత్ర ఫలితం
మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలనే తహతహలాడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు తాము సీఎం కేసీఆర్ ను కలవనున్నట్లు వారు ఇటీవల ప్రకటించారు. దీంతో పార్టీలో చేర్చుకోడానికు తెలంగాణా ముఖ్యమంత్రి వారితో చర్చలు జరుపనున్నట్లు ప్రచారం జోరందుకుంది. రాజకీయ దుమారం రేగడంతో ఇలా ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందో శ్రీధర్ బాబు, గండ్ర వివరణ ఇచ్చారు. 


"ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన నిమిత్తం జిల్లాకు వస్తుండటంతో మర్యాద పూర్వకంగా కలుస్తామని ప్రకటించగా, తామేదో టీఆర్ఎస్ పార్టీలో చేరడానికే సీఎంను కలుస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడబోమని శ్రీధర్ బాబు, గండ్ర  స్పష్టం చేశారు. అలాగే కాళేశ్వరం రీడిజైనింగ్పపై గతంలో చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నామని  తెలిపారు.
gandra venkataramana reddy duddilla sridhar babu కోసం చిత్ర ఫలితం
ఇవాళ ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించనున్నారు. అందుకోసం ప్రత్యేక హెలికాప్టర్ లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగే జిల్లాల్లో పర్యటించ నున్నారు. మేటిగడ్డ, సుందిళ్ల అన్నారం, శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం, రాజేశ్వరరావుపేట,రాంపూర్ లలో జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. ఇలా రెండు రోజులు పాటు సీఎం పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటన సందర్భంగానే తమ జిల్లాలకు సీఎం వస్తుండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలుస్తామంటూ ప్రకటించారు.  


ఇటీవలే స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం కీలక పరిణామం అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనార్థం మేడిగడ్డ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం "తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి" .అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారట.    
KCR with Congress MLAs కోసం చిత్ర ఫలితం
ప్రాజెక్టు సందర్శనార్థం మేడిగడ్డ చేరుకున్న సీఎంను  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్ధిళ్ల శ్రీధర్, గండ్ర వెంకటరమణారెడ్డి లు కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూ నిర్వాసితుల కు పరిహారం చెల్లింపులపై ఎమ్మెల్యేలు కేసీఆర్ కు వినతిపత్రం సమర్పించారు. 


ఈ సందర్భంగా కాంగ్రెస్ తనను కలసిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా ఇస్తూ, ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రతీ ఎకరాకు నీరు అందిస్తామని ఎమ్మెల్యేలు విపక్షంలో ఉన్నా రాష్ట్ర అభివృద్ధిపై సహకరిస్తామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా అంతా కలిసి పనిచెయ్యాల్సిన అవసరా న్ని కేసీఆర్ నొక్కివక్కాణించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: