వైసీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యా యత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హత్యాయత్నం కేసుపై శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.



వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై దాడి ఘటనకు సంబంధించి కేసును ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం ఎన్ఐఏకు కేసు దర్యాప్తు అప్పగించాలని జగన్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. ఎన్ఐఏకు అప్పగించకుండా సిట్ దర్యాప్తు చేస్తే కేసు విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని జగన్మోహనరెడ్డి తరపు న్యాయవాది వాదించారు.
murder attempt case on jagan to NIA కోసం చిత్ర ఫలితం
కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం ఉందని పిటిషనర్‌ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించి న హైకోర్టు కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇరువాదనలు విన్న హైకోర్టు ఎన్ఐఏ కు కేసును అప్పగించింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఐఏతో దర్యాప్తు చెయ్యించాలని పలుమార్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుపై నమ్మకం లేదని వైఎస్ జగన్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 
murder attempt case on jagan to NIA కోసం చిత్ర ఫలితం 

ఎన్‌ఐఏ యాక్ట్‌ ప్రకారం కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయాలని జగన్‌ తరపు న్యాయవాది గత విచారణలో కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారు మారు అయ్యే అవకాశం ఉందని పిటిషనర్‌ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కేంద్ర, రాష్ట్రాలను హైకోర్టు గతం లోనే అడిగి తెలుసుకుంది. ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే, తామే తీసుకుంటామని హైకోర్టు తేల్చిచెప్పడంతో కేంద్రం దిగొచ్చి ఎన్‌ఐఏ విచారణకు అంగీకరించింది. పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ లోని వీవీఐపీ లాంజ్‌లో అక్టోబర్‌ 25న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పక్కనే ఉన్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

NIA కోసం చిత్ర ఫలితం

రక్షణశాఖకు చెందిన తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ లో జరిగిన ఈ దారుణ ఘటన వెనుక భారీ కుట్ర దాగి ఉందనేది ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మినహా కేంద్రం మొదలు అన్ని రాజకీయ పక్షాలూ అనుమానిస్తూ వచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్‌) ఉన్నతాధికారులు కూడా ప్రాథమిక విచారణలో ఇదే నిర్ధారణకు వచ్చారు. అయితే ఘటన జరిగిన మరుక్షణం నుంచే కేసును నిర్వీర్యం చేసేందుకు, పక్కదారి పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆరాటపడుతూ వచ్చింది.

NIA is going to investigate jagan murder attempt case కోసం చిత్ర ఫలితం

ఆ క్రమంలోనే సీఎం చంద్రబాబు మొదలు, డీజీపీ ఠాకూర్, మంత్రులు, టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడారు. వైఎస్‌ జగన్‌పై సానుభూతి కోసమే శ్రీనివాసరావు దాడి చేశాడని ఏకపక్షంగా ప్రకటనలు చేశారు. ఏదో చిన్నపాటి ఘటనగా చిత్రీకరించేందుకు యత్నించారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించాలని వైసీపీ న్యాయస్థానాన్ని కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: