చంద్రబాబు, జగన్.. ఉప్పు అంటే నిప్పు.. ఇది అందరికీ తెలిసిందే. జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో మొదలైన రాజకీయ వైరం.. ఇప్పుడు వారసత్వంగా ఆయన కుమారుడు జగన్‌కు కూడా వచ్చింది. ఏపీలో ఎన్నికల సమయం వచ్చిన వేళ.. చంద్రబాబు, జగన్ ఒక్కటవుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related image



సాధారణంగా చూస్తే ఇది చాలా అసాధ్యమైన వ్యవహారం. కానీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాటలు చూస్తుంటే ఇది సాధ్యమవుతుందేమే అనిపిస్తోంది. ఆయన ఏమన్నారంటే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు.. జగన్ ని కూడా మిత్రుడ్ని చేసుకోటానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు.

Image result for jc diwakar reddy on jagan


జేసీ దివాకర్ రెడ్డి అంటేనే సంచలన వ్యాఖ్యలకు నిలయం. మరి ఆయన ఈ మాటలు సీరియస్‌గా అన్నారా.. దీని వెనుక టీడీపీ వ్యూహమేమైనా ఉందా అన్నది ముందుముందు కానీ తెలియదు. ఇప్పటికే చంద్రబాబు మోడీపై పోరుకు పవన్ కల్యాణ్ కలసిరావాలని పిలుపు ఇచ్చారు. దాన్ని జనసేనాని తిప్పికొట్టారు.

Related image


మరి ఇప్పుడు జేసీ.. చంద్రబాబుతో జగన్ చేతులు కలపాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. అసలు టీడీపీలో ఏం జరుగుతోంది. ఇవన్నీ పథకం ప్రకారం చేస్తున్న వ్యాఖ్యలా.. ప్రత్యర్థులను గందరగోళం చేసేందుకు పసుపు దళం ప్రయత్నిస్తోందా.. లేక.. ఎవరో ఒకరు సపోర్ట్ లేకపోతే ఎన్నికల బరిలోకి దిగలేని అసహాయతలో ఉందా.. అన్నీ సమాధానం లేని ప్రశ్నలే.


మరింత సమాచారం తెలుసుకోండి: