అన్ని విష‌యాలూ రాజ‌కీయం చేయాలంటే.. ఎవ‌రికైనా ఇబ్బందే! ఎంత రాజ‌కీయ అనుభ‌వం ఉన్నా కూడా ఒక్కొక్క‌సారి ప‌రిస్థితులు అనుకూలించే అవ‌కాశం ఉండ‌దు. తాజాగా ఏపీలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న కూడా రాజ‌కీయంగా వాడుకునేందుకు చంద్ర‌బాబుకు అవ‌కాశం లేకుండా పోతుంద‌ని, ఈ ప‌రిణామాన్ని ఆయ‌న లైట్‌గా నే తీసుకోవాల‌ని రాజ‌కీయ పండితులు సూచిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు ప్ర‌తి విష‌యాన్నీ త‌న‌కు అనుకూలంగా మార్చుకోవాలని చంద్ర‌బాబు భావిస్తున్నారు. దీనిని ఎవరూ త‌ప్పుప‌ట్ట‌డం లేదు. ఏ రాజ‌కీయ పార్టీ అయినా త‌న‌కు అనుకూలంగా రాజ‌కీయాలు మార్చుకోవ‌డం స‌హ‌జం. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు అనేక అంశాల‌ను త‌న‌కు , పార్టీకి అనుకూలంగా మార్చుకుని ప్ర‌జ‌ల్లో సింప‌తీ పొందేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. 


ఇదే క్ర‌మంలో ఇప్పుడు జ‌గ‌న్‌పై విశాఖ ప‌ట్టణంలో జ‌రిగిన కోడిక‌త్తి దాడి ఘ‌ట‌న‌ను కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకు నేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ కేసును రాష్ట్ర పోలీసులే విచారిస్తున్నారు. ఇప్ప‌టికే దీనిపై రెండు మూడు సార్లు పోలీసులు వివ‌రించారు. అయితే, త‌న‌కు వీరిపై న‌మ్మ‌కం లేద‌ని జ‌గ‌న్ ఆది నుంచి కూడా ఆరోపి స్తున్నారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో విచార‌ణ చేయించాల‌ని కోరుతున్నారు. దీనికి సంబంధించి తాజాగా కేంద్ర ప్ర‌బు త్వం ఎన్ ఐఏకి ఈ కేసు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. అయితే, దీనికి చంద్ర‌బాబు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని శాంతి భ‌ద్ర‌త‌ల అంశ‌మ‌ని, కేంద్రం దూకుడుగా వ‌స్తూ.. రాష్ట్ర అధికారాల‌ను గుంజుకోవాల‌ని చూస్తు న్నార‌ని ఆరోపించారు. 


అంతేకాదే, దీనిపై ప్ర‌జ‌ల్లోకి వెళ్లి.. కేంద్రంలోని మోడీకి, జ‌గ‌న్‌కు మ‌ధ్య ఉన్న సంబంధాన్ని వివ‌రించాల‌ని, రాజ‌కీయం గా జ‌గ‌న్‌ను తొక్కేయాల‌ని కూడా చంద్ర బాబు చెబుతున్నారు. అయితే, ఈ విష‌యంలో మేదావులు చెబుతున్న మాట వేరేగా ఉంది. గ‌తంలో ఈ కేసు త‌మ ప‌రిధిలోకి రాద‌ని, విమానాశ్ర‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు కేంద్ర‌మే బాధ్య‌త వ‌హిం చాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఈ విష‌యం ఆయ‌న మ‌రిచిపోయినా ప్ర‌జ‌లు మ‌రిచిపోలేదు. ఇక‌, విమా నాశ్ర యంలోకి కోడిక‌త్తి ఎలా వ‌చ్చిందో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ, అమిత్ షాలే చెప్పాల‌ని అప్ప‌టి వేడిలో ఆరోపిం చారు. నిజానికి ఈ ప‌రిణామాలు అప్ప‌ట్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీశాయి. 


అంటే.. జ‌గ‌న్‌పై దాడి కేసులో త‌న‌మీద‌కు ఏమైనా నేరం వ‌స్తుందేమో.. ఎన్నిక‌ల్లో ప్ర‌భావం క‌నిపిస్తుందేమో అని అప్ప‌ట్లో భావించిన బాబు.. ఇలా వ్యాఖ్యానించారు. అయితే, ఇప్ప‌డు అక్క‌డి అధికారులు బాబుకు భ‌రోసా ఇవ్వ‌డంతో రివ‌ర్స్ ఫైట్ ప్రారంభించారు. వాస్త‌వానికి ఇలా రివ‌ర్స్ ఫైట్ చేయ‌డం క‌న్నా కూడా మౌనంగా ఉంటేనే బెట‌ర్ అని సూచిస్తున్నారు మేదావులు. నిజానికి ఈ కేసులో బాబు పాత్ర లేద‌ని ఎన్ ఐఏ కూడా నిర్ధారిస్తుంది కాబ‌ట్టి ఎన్నిక‌ల వేళ త‌న‌కు ప్ర‌చారం చేసుకునేందుకు మంచి అవ‌కాశం ల‌భించిట్టు అవుతుంద‌ని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: