వైసీపీకీ టీఆర్‌ఎస్‌ కీ దోస్తీ ఉందని చాలా కాలం నుంచి టీడీపీ చేస్తున్న ఆరోపణ. తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడం కూడా ఇందుకు కారణంగా చెబుతుంటారు. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు కేసీఆర్ ఫోటో ఉన్న గోడ గడియారాలు పంపిణీ చేస్తున్నారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.


చిత్తూరు జిల్లాలో మదనపల్లి ఎమ్మెల్యే తిప్పారెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు గోడ గడియారాలు పంచారు. అయితే ఆ వాచ్‌ డయల్‌ పై వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయి. అయితే పైన వైసీపీ ఫోటోలు ఉన్నా.. వాటిని చించితే కింద టీఆర్‌ఎస్ నేతల ఫోటోలు ఉండటం రాజకీయంగా కలకలం రేపుతోంది.


తెలంగాణ ఎన్నికల్లో పంచగా మిగిలిన వాచ్‌లను చిత్తూరు జిల్లాలో పైన స్టిక్కర్లు వేసి పంచుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు . అయితే తిప్పారెడ్డి సొంత డబ్బుతో గడియారాలు పంపిణీ చేస్తుంటే టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. గడియారాల సప్లైయర్‌ ఏదో తప్పు చేస్తే దాన్ని భూతంలో పెట్టి విమర్శలు చేయడం సిగ్గు చేటు అని వైసీపీ నేత మిధున్ రెడ్డి అంటున్నారు.

mithun reddy కోసం చిత్ర ఫలితం

అనంతపురంలో జరిగిన పరిటాల శ్రీరామ్‌ వివాహ వేడుకలకు హాజరైన కేసీఆర్‌ను మీ పార్టీ నేతలు అధికారికంగా ఆహ్వానించింది మరిచిపోయారా అని మిధున్‌ రెడ్డి ప్రశ్నించారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది నిజం కాదా అన్నారు. కేసీఆర్‌ను  అమరావతి శంకుస్థాపనకు పిలిచింది వాస్తవం కాదా? కేసీఆర్‌ యాగానికి వెళ్లి పట్టు వస్త్రాలు ఇచ్చింది నిజం కాదా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: